ప్రశాంతంగా ముగిసిన పీజీఈసెట్ -2023 ప్ర‌వేశ ప‌రీక్ష‌

నవతెలంగాణ-హైద‌రాబాద్ : జేఎన్టీయూ నిర్వ‌హించిన టీఎస్ పీజీఈసెట్‌-2023 ప్ర‌వేశ ప‌రీక్ష స‌జావుగా నిర్వ‌హించారు. రాష్ట్రంలోని ఆయా యూనివ‌ర్సిటీల ప‌రిధిలోని ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంటెక్ ఆర్కిటెక్చ‌ర్ వంటి కోర్సుల్లో ప్ర‌వేశాల నిమిత్తం పీజీఈసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష నిర్వ‌హించారు. సోమ‌వారం ఉద‌యం 10 నుంచి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు జియో ఇంజినీరింగ్, జియో ఇన్ఫ‌ర్మెటిక్స్, ఫార్మసీ కోర్సుల‌కు, మ‌ధ్యాహ్నం 2 నుంచి 4 గంట‌ల వ‌ర‌కు సివిల్ ఇంజినీరింగ్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాల‌జీ, ఏరోస్పేస్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఉద‌యం సెష‌న్‌కు 96.13 శాతం మంది విద్యార్థులు, మ‌ధ్యాహ్నం సెష‌న్‌కు 88.01 శాతం మంది విద్యార్థులు హాజ‌రైన‌ట్లు పీజీఈసెట్ క‌న్వీన‌ర్ వెల్ల‌డించారు.

Spread the love