ఆటో డ్రైవర్ కూతురుకు ట్రిబుల్ ఐటీలో చోటు 

నవతెలంగాణ దుబ్బాక రూరల్

ఆటో డ్రైవర్ కూతురుకి బాసర ట్రిబుల్ ఐటీలో చోటు దక్కింది.దుబ్బాక మండలం గంభీర్పూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థిని  జంగా ప్రణతి ఇటీవల 10వ తరగతి మంచి ఉత్తీర్ణత పొందింది. తాజాగా ఆ విద్యార్థిని బాసర త్రిబుల్ ఐటీలో రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించి సీటు దక్కించుకుంది. పేద ముదిరాజు కుటుంబానికి చెందిన జంగా కిషన్ ఆటో నడుపుతూ, తల్లి బీడిలు చేస్తూ వారి కూతురు ప్రణతిని చదివించారు. బాసర ట్రిపుల్ ఐటీలో చోటు లభించడం పట్ల గంభీర్పూర్ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు 
మండల పరిధిలోని గంభీర్పూర్ గ్రామానికి నిరుపేద విద్యార్థిని ప్రణతి ట్రిపుల్ ఐటీ లో సీటు పొందడం పట్ల మంగళవారం గంభీర్పూర్ గ్రామ సర్పంచ్ కారికే భాస్కర్, ఉప సర్పంచ్ బాలయ్య, జడ్పిటిసి కడతాల రవీందర్ రెడ్డి,ఎంపీపీ కొత్త పుష్పలత కిషన్ రెడ్డి,  మాజీ వైస్ ఎంపీపీ బాణాల శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చేపూరి పరుశరాములు గౌడ్, బాణాల సునంద లతో పాటు జిల్లా పరిషత్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు సుధాకర్, ఉపాధ్యాయ బృందం , ఎస్ఎంసి చైర్మన్ చింతు లింగం విద్యార్థినికి శుభాకాంక్షలు తెలిపి అభినందించారు. ఈ సందర్భంగా వారు ప్రణతి ఉన్నత చదువులు చదివి ఉద్యోగం సాధించాలని ఆకాంక్షించారు.
Spread the love