యడియూరప్పపై పోక్సో కేసు నమోదు

నవతెలంగాణ – కర్నాటక: కర్నాటక మాజీ సీఎం బీఎస్ యడియూరప్పపై ఆ రాష్ట్ర సీఐడీ అధికారులు పోక్సో కేసు నమోదు చేశారు. ఓ కేసులో సాయం కోసం ఆయన ఇంటికి వెళ్తే తన కూతురిని(17ఏళ్లు) అసభ్యంగా తాకారని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. క్యాన్సర్ కారణంగా బాధితురాలి తల్లి గత నెలలో కన్నుమూయగా.. ఆమె సోదరుడు సత్వర న్యాయం చేయాలంటూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఐడీ యడియూరప్పపై చార్జిషీటు ఫైల్ చేసింది.

Spread the love