జిల్లాకు చేరుకున్న పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు

నవతెలంగాణ-సిరిసిల్ల : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో గురురువారం పోలీస్ అబ్జర్వర్ గా జిల్లాకు వచ్చిన పోలీస్ అబ్జర్వర్ వినిత సాహు కు పంచాయితీ రాజ్ గెస్ట్ హౌస్ లో  జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు  జిల్లా శాంతిభద్రతల నిర్వహణ,జిల్లాలో ఏర్పాటు  చేసిన చెక్పోస్టులు, ఇప్పటివరకు జిల్లాలో పట్టుబడిన అక్రమ సరుకు, డబ్బు, మద్యం, ఎన్నికల సమయంలో కేంద్ర బలాగాల వినియోగింపు,సమస్యత్మక ప్రాంతాలు పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక చర్యలు తదితర అంశాలపై పోలీస్ అబ్జర్వర్ కి జిల్లా ఎస్పీ  వివరించారు.
ఎస్పీ  వెంట అదనపు ఎస్పీ చంద్రయ్య, డిఎస్పీ లు,ఉన్నారు.

Spread the love