Sunday, May 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకేంద్ర మంత్రి ‘బండి’ ఇంట్లో పోలీసుల తనిఖీలు

కేంద్ర మంత్రి ‘బండి’ ఇంట్లో పోలీసుల తనిఖీలు

- Advertisement -

క‌రీంన‌గ‌ర్‌కు వ‌చ్చిన ప్ర‌త్యేక పోలీసు బృందం
నవతెలంగాణ – కరీంనగర్‌ క్రైమ్‌
బండి సంజయ్ కుమార్‌ నివాసంలో శనివారం పోలీసులు ముమ్మర తనిఖీలు చేశారు. బండి సంజరు కుమారుడు బండి భగీరథ్‌ ఆచూకీ కోసం కరీంనగర్‌ టూ టౌన్‌ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ సృజన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక పోలీసు బృందం ఈ సోదాలు నిర్వహించింది. కొన్ని రోజులుగా బండి భగీరథ్‌ బాహ్య ప్రపంచానికి అందుబాటులో లేకపోవడం, ఆయన ఎక్కడున్నారనే దానిపై స్పష్టమైన సమాచారం లేకపోవడంతో పోలీసులు ఈ చర్యకు ఉపక్రమించారు. భగీరథ్‌ ప్రస్తుత లొకేషన్‌, ఆచూకీకి సంబంధించిన కీలక ఆధారాలను సేకరించడమే లక్ష్యంగా పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. శనివారం బండి సంజరు నివాసానికి చేరుకున్న పోలీసులు ఇల్లంతా చూశారు. ఇంట్లోని సభ్యులను అడిగి కొన్ని వివరాలు సేకరించినట్టు సమాచారం. ఈ తనిఖీల నేపథ్యంలో బండి సంజరు నివాసం వద్ద కాసేపు ఉత్కంఠ వాతావరణం నెలకొంది. అసలు భగీరథ్‌ అందుబాటులో లేకపోవడానికి గల కారణాలు ఏంటి? అనే చర్చ రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఈ సోదాలపై బండి సంజరు కార్యాలయం గానీ, బీజేపీ శ్రేణులుగానీ ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -