Sunday, May 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంబండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలి

- Advertisement -

​బండి సంజయ్ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ అబ్బాస్
నవతెలంగాణ- మెదక్‌టౌన్‌
ఫొక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎండి అబ్బాస్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. మెదక్‌ జిల్లాలో నిర్వహిస్తున్న సీపీఐ(ఎం) రాజకీయ శిక్షణ తరగతులకు శనివారం హాజరైన అబ్బాస్‌.. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజరు పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ‘బేటి బచావో- బేటి పడావో’ అంటూ మహిళల రక్షణ గురించి మాట్లాడే కేంద్ర ప్రభుత్వం తన క్యాబినెట్‌లోని మంత్రి కుమారుడిపై ఇలాంటి ఆరోపణలు వచ్చిన ప్రధానమంత్రి స్పందించక పోవడం దురదృష్టకరమని అన్నారు. బాధితురా లికి న్యాయం చేయాల్సిన పోలీసులు పారదర్శ కంగా వ్యవహరించకుండా కేంద్ర మంత్రికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెంటనే స్పందించి హోంమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తూ బండి భగీరథ్‌ను అరెస్టు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఫొక్సో కేసు నమోదైన తర్వాత కూడా నిందితుడిని అరెస్టు చేయకుండా సిట్‌ విచారణ పేరుతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగు తోందని విమర్శించారు. రాష్ట్ర మంత్రివర్గంలోని మహిళా మంత్రులు కొండ సురేఖచ సీతక్క కూడా ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరం అన్నారు. బాధిత కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతా మని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కె.నర్సమ్మ, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ.మల్లేశం, ఏ.మహేందర్‌ రెడ్డి, కె.మల్లేశం, బాలమణి, నాయకుల కడారి నాగరాజు, సంతోష్‌, నాయకులు అజరు, బాబు, కవిత తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -