ఎన్నికలు సజావుగా జరిగేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలి. పసర ఎస్సై షేక్ మస్తాన్

నవతెలంగాణ- గోవిందరావుపేట
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని పసర పోలీస్ స్టేషన్ ఎస్ఐ షేక్ మస్తాన్ అన్నారు. శుక్రవారం మండలంలోని పసర పోలీస్ స్టేషన్ ఆవరణలో అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ ఐ షేక్ మస్తాన్ ఒక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మస్తాన్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల దృశ్య ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి  వివరించటం జరిగింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించుటకు గాను ముందస్తు పెర్మిషన్ తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, మసీదులు , ఆలయాలు ఇతర ప్రభుత్వా స్థలాల్లో ఎటువంటి సమావేశాలు నిర్వహించారాదు.రాత్రి 10 నుండి ఉదయం 06 వరకు ఎటువంటి ర్యాలి గాని, సమావేశాలు గాని పెట్టుకోరాదు. ఎన్నికల సందర్బంగా సోషల్ మీడియా పై నిఘా ఉంటుంది కావున ఎవరు అనుచిత పోస్ట్లు కానీ ,కామెంట్స్ కానీ పెట్టరాదు. వాట్సాప్ గ్రూప్ లో తప్పుడు రాజకీయ పోస్ట్స్, చర్చలు నిషేదించబడును ఒకవేళ అలా ఏమైనా జరిగితే అడ్మిన్ పూర్తి భాద్యత వహించ వలసి ఉంటుందన్నారు.ఈ విధంగా అన్ని రాజకీయ  పార్టీలు ఎన్నికల నియమ నిభందనలు ప్రకారం నడుచుకోవాలని ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించాలి విజ్ఞప్తి చేశారు. నిబంధనను అధిక్రమిస్తే చట్టరీత్య చర్యలు తప్పవని హెచ్చరించారు.
Spread the love