గురుకులాల ప్రభంజనం

– ఇంటర్‌ ఫలితాల్లో సత్తాచాటిన విద్యార్థులు
– కార్పొరేట్‌ కాలేజీల కంటే మెరుగైన ఫలితాలు
– ప్రభుత్వరంగ కాలేజీల్లో 74.11 శాతం ఉత్తీర్ణత
– ప్రయివేటు కళాశాలల్లో 65.24 శాతం పాస్‌
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాల్లో గురుకుల విద్యాలయాల సొసైటీలు సత్తాచాటాయి. ప్రయివేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల కంటే మెరుగైన ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించాయి. తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీలు (టీఎస్‌ఆర్జేసీ) అన్నింటి కంటే ఉత్తమ ఫలితాలు సాధించి అగ్రస్థానంలో నిలిచాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 92.53 శాతం ఉత్తీర్ణతను టీఎస్‌ఆర్జేసీ కాలేజీలు నమోదు చేశాయి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో మైనార్టీ గురుకులాలు 83.65 శాతం, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు 83.23 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. బీసీ గురుకుల విద్యాలయాలు 82.87 శాతం, గిరిజన గురుకులాలు 81.52 శాతం ఉత్తీర్ణత సాధించాయి. కేజీబీవీలు 77.42 శాతం, కేంద్ర ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 76.62 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు 49.13 శాతం, ఎయిడెడ్‌ జూనియర్‌ కాలేజీల్లో 46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గురుకులాలు కలిపి ప్రభుత్వరంగ జూనియర్‌ కాలేజీలు 74.11 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశాయి. ప్రయివేటు జూనియర్‌ కాలేజీల్లో 65.24 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
యాజమాన్యాల వారీగా ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత వివరాలు యాజమాన్యం హాజరు ఉత్తీర్ణత శాతం
ప్రభుత్వ 77,022 37,842 49.13
ఎయిడెడ్‌ 7,043 3,209 45.56
ప్రయివేటు 3,44,724 2,24,911 65.24
ఎస్సీ గురుకులాలు14,802 12,320 83.23
గిరిజన గురుకులాలు 7,810 6,367 81.52
బీసీ గురుకులాలు 8,541 7,078 82.87
మైనార్టీ గురుకులాలు 8,436 7,057 83.65
టీఎస్‌ఆర్జేసీ 2,544 2,354 92.53
మోడల్‌ స్కూల్స్‌ 19,827 12,377 62.42
కేజీబీవీ 11,281 8,734 77.42
కేంద్ర ప్రభుత్వ కాలేజీలు154 118 76.62

Spread the love