బస్సు షెల్టర్‌ ఏర్పాటు చేసిన ఆర్టీసీ అధికారులు

నవతెలంగాణ-నిజాంపేట
ఎన్నో సంవత్సరాల నుంచి నిజాంపేట మండల కేంద్రంలో బస్టాండ్‌ లేకపోవడంతో ప్రయాణికులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలు తీవ్రంగా ఉన్నందున ఆర్టీసీ అధికారులు స్పందించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో మండల కేంద్రంలోని నూతన బస్‌ స్టాప్‌ వద్ద బస్సు షెల్టరు ఏర్పాటు చేయడం జరిగింది. నిజాంపేట మండల కేంద్రానికి చెందిన చిన్న పైడి శ్రీనివాస్‌ రెడ్డి తన సొంత 20 గుంటల భూమిని ఆర్టీసీ కి దానం చేసి రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం జరిగింది. మెదక్‌ బస్‌ డిపో మేనేజర్‌ సుధా మాట్లాడుతూ ఈ ఎండాకాలంలో ఎండలు తీవ్రంగా ఉన్నందున ప్రయాణికులకు ఇబ్బందులు కలగకూడదనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా బస్సు షెల్టర్‌ ను ఏర్పాటు చేయడం జరుగిందన్నారు. ఆర్టీసీకి సంబంధించిన ఖాళీ స్థలంలో భూమిలో హద్దు బందులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సంవత్సరం బడ్జెట్లో ఆర్టీసీకి నిధులు కేటాయించినట్లయితే మండల కేంద్రంలో నూతన బస్టాండు కట్టించే ఏర్పాట్లు చేస్తామని అన్నారు. ప్రయాణికులకు సేవలందించడమే ఆర్టీసీ ముఖ్య ఉద్దేశమన్నారు. గతంలో ఎంతోమంది డిపో మేనేజర్లు వచ్చిన ఎలాంటి చర్యలు చేపట్టలేదని ప్రస్తుత డిపో మేనేజర్‌ వచ్చిన తర్వాత నిజాంపేట బస్టాండ్‌ స్థలాన్ని గుర్తించి హద్దు బంధువులు ఏర్పాటు చేసినందుకు నిజాంపేట గ్రామస్తులు కతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. కంట్రోలర్‌ బాబు సింగ్‌, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Spread the love