ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుచున్నదనీ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అర్జీదారుల నుండి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. అర్జీదారుని సమస్యను పరిశీలించి సంబంధిత శాఖ అధికారి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆయా అర్జీదారునికి తన దరఖాస్తు పై తీసుకున్న చర్యల గురించి సమాచారం అందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేసారు. సోమవారం 82 దరఖాస్తులు రావడం జరిగిందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ రావు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.