రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని చేపడుతుందని మద్నూర్ మండల తహసీల్ధార్ ఎండి ముజీబ్ తెలిపారు. ప్రతి సోమవారం తహసీల్ధార్ కార్యాలయంలో మండల ముఖ్య మండల అధికారుల ఆధ్వర్యంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న తహసీల్దార్ ఏం.డి ముజీబ్, ఎంపీడీఓ, ఎంపీవో, ఏం. ఈ వో, ఐసీడీఎస్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.