యాసంగి వరిలో కాండం తొలిచె పురుగు ఉధృతి నివారణ చర్యలు

– ఎన్ శ్రీధర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ 
నవతెలంగాణ – గోవిందరావుపేట
యాసంగి వరి పంటలో కాండం తొలిచె పురుగు ఉధృతి నివారణకు సరైన చర్యలు చేపట్టి నివారించుకోవాలని ఎన్ శ్రీధర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ ఎటునాగారం అన్నారు. మంగళవారం మండలంలోని యాసంగి వరి పంట వ్యవసాయ క్షేత్రాలను స్థానిక ఏవో కే జితేందర్ రెడ్డి తో కలిసి పరిశీలించి రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. శ్రీధర్ రైతులతో మాట్లాడుతూ గత సంవత్సరం కూడా యాసంగిలో వరి పంటలో కాండం తొలిచేపురుగు ఉధృతంగా వ్యాపించి నప్పటికీ రైతులు సమర్ధవంతంగా నివారించుకొని మంచి దిగుబడులను సాధించారని అన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రారంభం నుండి కాండం తొలిచే  పురుగు ఉధృతి అధికంగా ఉందా నందున సరైన యాజమాన్య చర్యలు చేపట్టాలని అన్నారు. కాండము తొలిచే పురుగును గుర్తించడానికి దీపపు ఏర  లేదా సోలార్ దీపపు ఏర కానీ లింగాకర్షణ బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై  నిగా పెట్టాలని అన్నారు. పిలక దశలో ఎకరానికి మూడు లింగాకర్షణ బుట్టలు పెట్టి వారానికి బుట్టకు 25 నుండి 30 పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. నారుమడి దశలో ఈ పురుగు ఆశించినట్లయితే కార్బోఫ్యురాన్ 3జి గుళికలను 600 గ్రాములు పిప్రో నిల్  గుళికలు వేసి నివారించుకోవాలి. వరి నాటిన 15 రోజుల వయసులో పిలక చేస్తున్న తరుణంలో కార్బో ఫ్యూరాన్ 3జి గుళికలు ఎకరానికి 10 కిలోలు కాట్రాపు హైడ్రోక్లోరైడ్ ఫోర్ జి గుళికలు గుళికలు ఎకరానికి 8 కిలోలు క్లోరంతనిలప్రోలు ఫోర్ జి గుళికలు నాలుగు కిలోలు  ఎగరానికి 20 నుండి 25 కేజీల ఇసుక లో కలిపి వెదజల్లి నివారించుకోవచ్చని అన్నారు. అంతేకాక మొగి పురుగు నివారణకు సిపారసు చేయబడిన 10 జి లేదా సేంద్రియ గుళికలను యూరియాతో కలిపి వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతులు గమనించాలని అన్నారు. గత రెండు సంవత్సరాల నుండి పురుగు ఉధృతి అధికంగా ఆశించిన నష్టపరుస్తున్నందున వరి పంట చిరు పొట్ట దశలో రెక్కల పురుగు ఉధృతి గమనించినట్లయితే కార్ టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పీ రెండు గ్రాములు లీటరు నీటికి చొప్పున ఎకరానికి 400 గ్రాములు లేదా క్లోరంతా నిలప్రోలు 0.3 ఏం ఎల్ఏకరానికి 60 మిల్లీలీటర్ల చొప్పున లేదా ఐపో సైక్లోసిరం 0. 6 యం యల్ 128 లీటర్ల చొప్పున పిచికారి చేసి సమర్థవంతంగా నివారించుకోవచ్చని సూచించారు.  ఈ కార్యక్రమంలో ఏఈఓ భూపాల్ రెడ్డి తో పాటు రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love