విత్తనాల ధరలను వెంటనే తగ్గించాలి

నవతెలంగాణ-బయ్యారం
వర్షాకాలం పంట పత్తి విత్తనాల ధరలను తగ్గిం చాలని కోరుతూ గురువారం సీపీఐ ఎంఎల్‌ ప్రజా పంథా అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం ఆధ్వ ర్యంలో మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతి ప త్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి ఐ ఎంఎల్‌ ప్రజాపంధా బయ్యారం సంయుక్త మం డల కార్యదర్శి బిల్లాకంటి సూర్యం మాట్లాడుతూ ప త్తివిత్తనాలపై కేంద్రంలో మోడీ ప్రభుత్వం పత్తి విత్త నాల ప్యాకెట్‌పై రూ.43లు పెంచడానికి బడా కంపె నీలతో ఒప్పందం చేసుకుందన్నారు. దీంతో రైతాం గంపై అధిక భారం పడుతుందన్నారు. ఒక జిల్లాలో రైతాంగానికి రూ.8 కోట్ల నష్టం వాటిల్లుతుందన్నారు. కష్టించి పనిచేసే రైతాంగంపై పత్తి విత్తనాల ప్యాకె ట్‌పై ఇలా ధరలు పెంచడం రైతాంగం నడ్డివిరిచే చర్యఅని అన్నారు. ఇప్పటికైనా కేంద్రంలో మోడీ ప్ర భుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి విత్తనాలపై తగు చ ర్యలు తీసుకోవాలని, పెంచిన విత్తనాల ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతాం గానికి అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉం చాలన్నారు. బ్లాక్‌ మార్కెట్‌ను అరికట్టాలని, దోషు లపై క్రిమినల్‌ కేసులుపెట్టాలన్నారు. రాష్ట్రంలో కేసీ ఆర్‌ ప్రభుత్వం రైతాంగానికి లక్ష రూపాయలు రుణ మాఫీ వెంటనే చేసి కొత్త రుణాలు వెంటనే ఇవ్వాలని, వ్యవసాయ రైతాంగానికి పరికరాలనుఉచితంగా అం దించాలని, సబ్సిడీలపై ఎరువులు పురుగు మందులు సరఫరా చేయాలని, పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు రూ.30 వేలు రైతాంగానికి అందించాలని డిమాండ్‌ చేశారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత ప్రగతిశీల వ్యవ సాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు ఉమ్మగాని సత్యం, రైతు సంఘంనాయకులు నారాయణరెడ్డి, పూర్ణ, రవి, అప్పయ్య తదితరులు పాల్గొన్నారు.
గూడూరు : వర్షాకాలానికి రైతులకు అవస రమగు విత్తనాల ప్యాకెట్‌ 450 గ్రాముల ప్యాకెట్‌ కు గతంలో ఉన్న రూ.700లు నుండి రూ.743కు కేంద్ర ప్రభుత్వం పెంచడం సరికాదని తక్షణమే పెరి గిన పత్తి విత్తనాలు ధరలను తగ్గించాలని సీపీఐ (ఎం ఎల్‌)ప్రజాపంథా కేసముద్రం గూడూరు సంయుక్త మండలాల సహాయ కార్యదర్శి ఫైండ్ల యాకయ్య డిమాండ్‌ చేశారు .జిల్లా కమిటీ పిలుపులో భాగంగా నేడు తహసిల్దార్‌ కార్యాలయంలోవినతిపత్రం అంద జేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విత్తనాల కంపెనీలో లాభాలకోసం ధరలుపెంచి రైతులపై భా రం మోపడం సరికాదన్నా రు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా 3లక్షల ఎకరాలలో పత్తి సాగవుతుందని ప్యాకె ట్‌ కు 43 పెంచడం వల్ల రూ.10 కోట్లభారం రైతు లపై పడనుందన్నారు. పత్తి విత్తనాలు డిమాండ్‌ను బట్టి కొందరు వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌ చేసే ప్ర మాదం ఉందని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే అవ కాశం ఉందన్నారు. అలాంటి వారిపై క్రిమినల్‌ కేసు లు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. మిర్చి, మొ క్కజొన్న తదితర విత్తనాల కల్తీ అరికట్టాలని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండ లాల కమిటీసభ్యుడు అడ్డూరి బ్రహ్మచారి పాల్గొన్నా రు.
నెల్లికుదురు :వర్షాకాలానికి రైతులకు అవస రమగు విత్తనాల ప్యాకెట్‌ 450 గ్రాముల ప్యాకెట్‌కు గతంలో ఉన్న 700 రూపాయల నుండి 743కు కేం ద్ర ప్రభుత్వం పెంచిన పత్తి విత్తనాల ధరలను తగ్గిం చాలని సీపీఐ(ఎంఎల్‌ )ప్రజాపంధా నెల్లికుదురు సంయుక్త మండలాల కార్యదర్శి ఇరుగు అనిల్‌ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు .జిల్లా కమిటీ పిలుపులో భాగంగా గురువారం నెల్లికుదురు తాహశీల్దార్‌ కా ర్యాలయంలో డిప్యూటీ తాహశీల్దార్‌ తరంగిణికి విన తిపత్రం ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ విత్తనాల కంపెనీలో లాభాల కోసం ధరలు పెంచి రైతులపై భారం మోపడం సరైంది కాదని ప్రభుత్వంపై మండిప డ్డారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో సుమారు 3 లక్షల ఎకరాలలో పత్తిసాగు అవుతుందన్నారు. ఒక్క ప్యాకె ట్‌కు 43 పెంచడం వల్ల 10 కోట్ల రూపాయల పెను భారం రైతులపై పడనుందన్నారు. పత్తివిత్తనాల డిమాండ్‌ను బట్టి కొందరు వ్యాపారులు బ్లాక్‌ మార్కె ట్‌ చేసే ప్రమాదం ఉందని, నకిలీ విత్తనాలు సరఫరా చేసే అవకాశం ఉందని అలా కాకుండా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు.అలాంటి వారిపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. మిర్చి, మొక్కజొన్న తదితర విత్తనాల కల్తీ అరికట్టాలని లేదంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కల్తీ విత్తనాల నిరోధానికి టాస్క్‌ ఫోర్స్‌ ఏర్పాటు చేయాలని క్రిమినల్‌ కేసులు పెట్టాలని డిమాండ్‌ చేశారు. ఈకార్యక్రమంలో యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Spread the love