చౌట్ పల్లిలో ప్రాథమిక స్థాయి సముదాయ సమావేశం

నవతెలంగాణ -కమ్మర్ పల్లి
మండలంలోని చౌట్ పల్లి ప్రాథమికోన్నత బాలికల పాఠశాలలో శుక్రవారం కాంప్లెక్స్ పదోనోపాధ్యాయులు  ఆంధ్రయ్య అధ్యక్షతన  ప్రాథమిక స్థాయి సముదాయ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రాథమిక స్థాయి పాఠశాల ఉపాధ్యాయులు ప్రతి పాఠశాల నుండి సగం ఉపాధ్యాయులు హాజరయ్యారు. సమావేశంలో వారి వారి పాఠశాలలో ఎఫ్ ఎల్ నిర్వహణ పద్ధతులను, లైబ్రరీ నిర్వహణ గురించి తెలియజేశారు. ప్రాథమిక స్థాయి సముదాయ సమావేశాన్ని మండల నోడల్ ఆఫీసర్ గంగాధర్, డిస్టిక్ సిపిటి వెంకటేశ్వర్లు, కిషన్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సమావేశాన్ని సందర్శించిన కిషన్  గణిత బోధన పద్ధతులు సంబంధించి వివరించగా,  వెంకటేశ్వర్లు ఇంగ్లీష్ కు సంబంధించిన నిర్వాణ విధానాన్ని, బోధన పద్ధతులను తెలియజేశారు. ఈ సమావేశంలో కాంప్లెక్స్ సెక్రెటరీ నరేందర్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love