ఢిల్లీ చేరుకున్న ప్రధాని మోడీ

నవతెలంగాణ – హైదరాబాద్: ఇటలీ పర్యటన ముగించుకున్న భారత ప్రధాని నరేంద్ర మోడీ తిరిగి ఢిల్లీ చేరుకున్నారు. ఇటలీలో జీ7 దేశాల అవుట్ రీచ్ సదస్సుకు హాజరైన మోడీ… వివిధ దేశాధినేతలతో సమావేశమయ్యారు. వారితో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. మొత్తమ్మీద మోడీ ఇటలీ పర్యటన విజయవంతమైందనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తదితరులతో మోదీ అనేక అంశాలపై చర్చలు జరిపారు.

Spread the love