ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవాలి

– వీవీఎంహెచ్‌ఎస్‌ ప్రిన్సిపల్‌ మండవ శ్రీనివాస్‌ గౌడ్‌
నవతెలంగాణ-కుత్బుల్లాపూర్‌
ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారానే వ్యాధి బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చని వివేకానంద విద్యా మందిర్‌ హై స్కూల్‌ ప్రధానోపాధ్యాయులు మండవ శ్రీనివాస గౌడ్‌ అన్నారు. శుక్రవారం కుత్బుల్లాపూర్‌ నియోజక వర్గం, సుభాష్‌ నగర్‌ 130 డివిజన్‌ పరిధిలోని సుభాష్‌ నగర్‌ ‘వివేకానంద విద్యా మందిర్‌ హై స్కూల్‌’ లో శివ డయాగస్టిక్‌ భాగ్యలక్ష్మి కాలనీ వారిచే ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా శ్రీనివాస గౌడ్‌ మాట్లాడుతూ…ఉపాధ్యాయులకు పాఠశాల ఆవరణలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మంచి ఆరోగ్యంతో ఉండాలని కనీసం సంవ త్సరానికి ఒకసారైనా విధిగా పరీక్షలు చేయించుకోవాలని తను ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తూ… ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏవైనా అనారోగ్య సూచనలు కనిపిస్తే వెంటనే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మండవ. శ్రీనివాస్‌ గౌడ్‌ కరెస్పాండెంట్‌ ఎం.సునీత, వైస్‌ ప్రిన్సిపాల్‌ లత, ఉపాధ్యాయుల బందం, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love