విశ్వగురువుగా మార్చడంలో ప్రయివేటు సంస్థలే కీలకం

విశ్వగురువుగా మార్చడంలో ప్రయివేటు సంస్థలే కీలకం– 2015 నుంచి పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు
– వాణిజ్య, వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సులో కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
దేశాన్ని విశ్వగురువుగా మార్చడంలో ప్రయివేటు సంస్థల భాగస్వామ్యం చాలా కీలకమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి నొక్కిచెప్పారు. అందులో భాగంగానే ప్రయివేటు సంస్థలకు 2015 నుంచి పెద్దఎత్తున ప్రోత్సహకాలు అందిస్తున్నామని చెప్పారు. 2030 నాటికి 100 మిలియన్‌ టన్నుల కోల్‌ గ్యాసిఫికేషన్‌ లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తున్నామనీ, అందులో ప్రయివేటు రంగం కీలక పాత్ర పోషించబోతున్నదని అన్నారు. వ్యాపార వేత్తలకు మోడీ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వాణి జ్య వ్యాపార వేత్తల ఆత్మీయ సదస్సు జరిగింది. అందులో కేంద్ర మంత్రి పీయుష్‌ గోయల్‌, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లా డుతూ..ప్రభుత్వానికి, పారిశ్రామికవేత్తలకు మధ్య నిర్మాణాత్మకమైన చర్చల ద్వారానే దేశ భవిష్యత్తుకు బాటలు పడుతాయన్నారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా నిలిపేందుకు ఎదురయ్యే సవాళ్లపై కార్పొరేట్‌ కంపెనీలతో చర్చించడానికి, ఆలోచనలు పంచుకోవడానికి, శక్తివంతమైన భాగస్వామ్యాలను నిర్మించడానికి ఇలాంటి వేదికలు అవసరమని అభిప్రా యపడ్డారు. పరిశోధన, అభివృద్ధి, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక అభివృద్ధికి హైదరాబాద్‌ కేంద్ర బిందువుగా ఉందనీ, ఇక్కడ తయారైన వ్యాక్సిన్‌ యావత్‌ ప్రపంచంలో కరోనా భయాన్ని తొలగించిందని చెప్పారు. ప్రయివేటు రంగ భాగ స్వామ్యం, సాంకేతిక పురోగతి ద్వారా సుస్థిరమైన ఆర్థిక ప్రగతిని సాధ్యమ వుతుదని స్పష్టం చేశారు. ఉద్యోగ కల్పన, ఎగుమతులు పెండానికి వినూత్న ఆలోచనలు అవసరమన్నారు. అందులో భాగంగానే తమ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొస్తున్నదని చెప్పారు. జీఎస్టీ, బ్యాంకింగ్‌ రంగ సంస్కరణలు, డిజిటలైజేషన్‌ వంటి చర్యలు దేశాన్ని ముందుకు నడిపించాయన్నారు. స్టార్టప్‌ కల్చర్‌ దేశ ప్రగతిలో కొత్త అధ్యాయాన్ని లిఖిం చిందనీ, ఆర్‌అండ్‌డీ సంస్థలకు పెద్దఎత్తున గ్రాంట్లు లభించాయని చెప్పారు. ఆర్టిఫిషియల్‌, ఇంటెలిజెన్స్‌, స్పేస్‌ టెక్నాలజీలో సాంకేతి పరిజ్ఞానాన్ని పెంచడానికి ఏఐ టెక్నాలజీని ప్రోత్సహిస్తున్నామన్నారు.

Spread the love