ఈ ఏడాది విద్యార్ధులకు సమస్యల స్వాగతం మే….

– 15 ఏళ్ళైనా భర్తీ కాని అటెండర్ పోస్ట్….
– మూలాన పడ్డ వృత్తి విద్యా కోర్సులు…
– వసతి గృహం లేకపోవడంతో కళాశాలలో చేరని బాలురు…
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం నేటి నుండే దశాబ్ది ఉత్సవాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ ప్రభుత్వ విద్యారంగం పట్ల చిన్న చూపే చూస్తుంది.ఈ ఉత్సవాల్లో నే విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు. కానీ గురువారం నుండి ప్రారంభం అయిన ఇంటర్ కళాశాలల్లో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే చందంగా ఉండటం గమనార్హం. నియోజక వర్గ కేంద్రంలో 2010 లో ఏర్పాటు అయిన ఏకైక ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాల లో నేటికీ అటెండర్ పోస్ట్ భర్తీ కాకపోవడం బాధాకరం.దీంతో బోధనా సిబ్బంది ఆ విధులను నిర్వహించడం గమనార్హం. ఈ కళాశాలలో తెలుగు – ఆంగ్ల మాధ్యమాల్లో బైపీసీ, ఎంపీసీ, హెచ్.ఈ.సీ, సి.ఈ.సీ కోర్సులు బోధిస్తున్నారు.ఎ.టి,ఓ.ఎ.ఎస్ అనే వృత్తి కోర్సులు బోధనా సిబ్బంది లేకపోవడంతో 2015 నుండీ మూలన పడ్డాయి.సాదారణ కోర్సులు కు చెందిన బోధనా సిబ్బందిని సైతం గతేడాది మాత్రమే రెగ్యులర్ చేసారు. ఈ కళాశాలలో మొత్తం 300 మంది విద్యార్ధిని విద్యార్ధులు ఉండగా 200 మంది బాలికలు కావడం విశేషం.ఎందుకంటే ఈ కళాశాల అనుబంధంగా గిరిజన సంక్షేమ శాఖ బాలికలు కోసం పోస్ట్ మెట్రిక్ హాస్టల్ ను నిర్వహిస్తుంది. దీంతో బాలికలు అధికంగా చేరి విద్యను అభ్యసిస్తున్నారు.బాలురు కోసం వసతి గృహం లేకపోవడంతో వారి చేరికలు తగ్గిపోతున్నాయి.ఈ ఏడాది అయినా బాలురు కోసం ఎస్.సి లేక ఎస్.టి సంక్షేమ శాఖ ల ఆద్వర్యంలో పోస్ట్ మెట్రిక్ హాస్టల్ నిర్వహించాలని విద్యార్ధులు తల్లిదండ్రులు కోరుతున్నారు.
అటెండర్ పోస్ట్ మంజూరు అయినా భర్తీ కాలేదు – సాగర్, ప్రిన్సిపాల్
బాలురు అడ్మిషన్ లు పెరగాలంటే వారికోసం పి.ఎం.హెచ్ ఏర్పాటు చేయాలి.గతేడేదే అటెండర్ పోస్ట్ మంజూరు అయినా భర్తీ చేయలేదు.దీంతో బెల్ కొట్టడం,గదులు శుభ్రం చేసే పని మేమే చేసుకోవాల్సి వస్తుంది.

Spread the love