గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

– సీఐటీయూ మండల కార్యదర్శి రాయికంటి గోపాల్‌
నవతెలంగాణ-షాద్‌నగర్‌
గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్క రించాలని, రెండు రోజుల నుండి సమ్మె చేస్తున్న ప్రభు త్వం స్పందించక పోవడం విడ్డూరంగా ఉందని సీఐ టీయూ కొందుర్గు మండల కార్యదర్శి రాయికంటి గోపాల్‌ అన్నారు. శుక్రవారం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర డవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రాయికంటి గోపాల్‌ మాట్లాడుతూ సమ్మెకు ప్రభుత్వం సహరించకుండా సమ్మెకు వస్తున్న కార్మికులను అధి కారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. మీరు విధులకు రానియెడల కొత్త వారిని విధులలోకి తీసుకుంటామని అధికారులు అనడం సిగ్గుచేటని తెలిపారు. మా జీతాలు పెంచండని శాంతి యు తంగా సమ్మె చేస్తున్నారని, వారు గొంతెమ్మ కోరికలు కోరడం లేదని తెలిపారు. కరోనా కాలంలో ఎన్నో ఇ బ్బందులు ఎదుర్కొని పనులు చేశారని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి తగిన గుణ పాఠం తప్పదని తెలిపారు. కార్యక్రమంలో ఏఐటి యుసి నాయకులు నర్సింలు, సీఐటీయూ నాయకులు సత్యమ్మ, జంగమ్మ, రామచంద్రి, రవి, బాబమ్మ, శీను, జంగయ్య, జయమ్మ, ప్రవీణ్‌, నర్సమ్మ, బాగమ్మ తదితరులు పాల్గొన్నారు.

Spread the love