నవతెలంగాణ డిచ్ పల్లి:
తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగానికి డీన్ గా ప్రొఫెసర్ జి రాంబాబు నియామకం పొందారు. తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ ఐఏఎస్ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ జి. రాంబాబు రెండు ఏళ్ళ పాటు నియామకం ఉత్తర్వులను అందజేశారు. గతంలో ప్రొఫెసర్ జి.రాంబాబు కామర్స్ విభాగపతిగా పాఠ్య ప్రణాళిక చైర్మన్ గా, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్గా, అడిషనల్ కంట్రోలర్ గా, డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్, హాస్టల్ కు వైస్ ప్రిన్సిపాల్, ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామర్ ఆఫీసర్గా, పూర్వ విద్యార్థుల అసోసియేషన్ కు డైరెక్టర్ గా విజయవంతంగా విధులు నిర్వహించి అధికారుల మన్ననలు పొందారు. ఈ నియామకపు ఉత్తర్వులు అందుకున్న ప్రొఫెసర్ జీ రాంబాబు మాట్లాడుతూ యూనివర్సిటీ అభివృద్ధిలో భాగం పంచుకుంటానని కామర్స్ విభాగంలో ప్రగతిశీల అన్వర్తిత పరిశోధనల కై కృషి చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రాంబాబు వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లకు కృతజ్ఞతలు తెలిపారు.