ఉరి తాళ్ళతో నిరసన..

– ఉరితో నిరసన తెలిపిన జీపీ కార్మికులు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గ్రామపంచాయతీ కార్మికులకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్ర( జేఏసీ)కమిటీ పిలుపు మేరకు కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన నిరవధిక సమ్మె సోమవారం నాటికి 19 వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా కార్మికులందరూ ఉరి తాళ్ళతో నిరసన తెలియజేశారు. అనంతరం జేఏసీ నాయకులు మట్లకుంట కామేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ఏ మాత్రం కార్మికులను పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు గా వ్యవహరిస్తుందని అన్నారు. గ్రామపంచాయతీ కార్మికులందరూ తమ హక్కుల ను సాధించుకునేందుకు సమ్మెను పోరాటాల ద్వారా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ (జేఏసీ) మండల అధ్యక్ష కార్యదర్శులు యాదగిరి వెంకటప్పయ్య,కేసుపాక నరసింహారావు,మూల అప్పన్న, మండల ట్రెజరర్ వేల్పుల ముత్తా రావు, మండల కమిటీ సభ్యులు మురళి,ఆరేపల్లి నాగేంద్రరావు, కట్ట శీను,రాజపుత్ర రంజిత్ సింగ్(నందు),బాణాల వరలక్ష్మి, అల్లాడి ధనమ్మ, బద్దే లక్ష్మి,పద్మ, జ్యోతి, రాణి,శ్యామ్, రమాదేవి, స్వప్న, రాధాకృష్ణ , ఇంద్ర,రాణి, నాగమణి,మరియమ్మ,రాము తదితరులు పాల్గొన్నారు

Spread the love