కేంద్రం విధానాలపై 1 నుంచి నిరసనలు

– 10 నుంచి తెలంగాణ విలీన వారోత్సవాలు
– విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి
– సాగర్‌ నీటివిడుదల చేయాలి విలేకర్ల సమావేశంలో జూలకంటి రంగారెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్‌ 1 నుంచి వారం రోజులపాటు గ్రామస్థాయి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాల గూడ పట్టణంలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కేంద్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా క్షేత్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టి ప్రజలను చైతన్య పర్చ నున్నట్టు చెప్పారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలపై ప్రజలకు వివరిస్తామన్నారు. దేశంలో తెలంగాణ విలీనమైన సెప్టెంబర్‌ 17న రాష్ట్ర ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. వీర తెలం గాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను ప్రజలకు వివరిం చాల్సిన అవసరం ప్రభు త్వంపై ఉందన్నారు. ఆనాడు జరిగిన ఉద్యమంలో వెట్టిచాకిరీ రద్దు, భూ పంపిణీ, 4వేల మంది ఆత్మబలిదానం, అప్పటి పరిస్థితిని ప్రజలకు వివరించాలన్నారు. సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సెప్టెంబర్‌ 10 నుంచి 17వ తేదీ వరకు వారం రోజులపాటు సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.
నాగార్జునసాగర్‌ ఎడమకాలువ పరిధిలో ఇప్పటికే వరి నాట్లు వేసుకొని సాగునీటి కోసం ఎదురుచూస్తున్నారని, భూగర్భ జలాలు అడు గంటిపోయి సాగు కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
శ్రీశైలం నుంచి కొంత వరకు నీరు సాగర్‌కు వస్తున్నందున ఉన్న నీటి నుంచి కొంత విడుదల చేసి చెరువులు, కుంటలు నింపితే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. కొంతవరకు వరి నాట్లు, నారు మడులకు జీవం పోసినట్టు అవుతున్నదన్నారు. తక్షణమే నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాల న్నారు. గృహలక్ష్మి పథకం దరఖాస్తులను వెంటనే క్షేత్ర స్థాయిలో విచారణ నిర్వహించి లబ్దిదారులను ఎంపిక చేసి నిధులను విడుదల చేయాలన్నారు.ఈ సమావేశంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, జిల్లా కమిటీ సభ్యులు డాక్టర్‌ మల్లు గౌతమ్‌రెడ్డి, భవాండ్ల పాండు, రాగిరెడ్డి మంగారెడ్డి, తిరుపతి రామ్మూర్తి, పాపిరెడ్డి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love