పబ్ జీ ప్రేమికుడి కోసం అమెరికా నుండి భారత్ చేరిన యువతి

నవతెలంగాణ – హైదరాబాద్ : పబ్‌జీ ఆడుతూ ప్రేమలో పడిన యువతి అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వచ్చిన యువతిని ఇటావా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఫ్లోరిడాకు చెందిన బ్రూక్లిన్‌ (30) అనే యువతికి ఇటావా యువకుడు హిమాన్షు యాదవ్‌తో పబ్‌జీ ఆట ద్వారా పరిచయం పెరిగి ప్రేమగా మారింది. హిమాన్షు కోసం కొన్ని నెలల క్రితం ఆమె చండీగఢ్‌కు చేరుకుందని సమాచారం. ప్రియురాలిని కలవడానికి హిమాన్షు కూడా చండీగఢ్‌కు వెళ్లాడు. ఆమెను అక్కడే పెళ్లాడి, కొద్దిరోజులు గడిపిన తరవాత ఇటావాకు తీసుకొచ్చాడు. స్థానికులు ఆమెను అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మళ్లీ చండీగఢ్‌కు వెళ్లిపోయేందుకు ఇద్దరూ ఆర్టీసీ బస్సు ఎక్కగా.. ముందుగా ఉన్న సమాచారంతో డ్రైవరు ఆ బస్సును నేరుగా పోలీస్‌స్టేషనుకు తీసుకుపోయాడు. అప్రమత్తంగా ఉన్న పోలీసులు బ్రూక్లిన్, హిమాన్షులను అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే ఆ యువతి తన పూర్తి అంగీకారంతోనే హిమాన్షుతో కలిసి చండీగఢ్‌ వెళ్లాలనుకుంటోందని రూరల్‌ ఎస్పీ విజయ్‌సింగ్‌ చెప్పారు.

Spread the love