నవ తెలంగాణ- గజ్వేల్
ప్రజా పాలన కార్యక్రమం సమర్థవంతంగా చిత్తశుద్ధితో నిర్వహించాలని జిల్లా నోడల్ ఆఫీసర్ సంగీత సత్యనారాయణ ఐఏఎస్ అన్నారు. శుక్రవారం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో పలు ప్రజాపాలన కార్యక్రమంలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఇతర విషయాలను ఆమె పరిశీలించారు. రెండవ రోజు విజయవంతంగా ప్రజాపాలన కొనసాగుతుందని ఆమె చెప్పారు. ప్రజలకు కావలసిన ప్రజా పాలన దరఖాస్తులు అందుబాటులో ఉంచాలని సూచించారు. జనవరి 6 వరకు జరిగే ఈ కార్యక్రమం అధికారులు సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని చెప్పారు. ఐదు గ్యారెంటీలకు సంబంధించి ప్రజలకు వివరించి వారికి కావాల్సిన పత్రాలను అందజేయాలని, తిరిగి దరఖాస్తు చేసుకునే ముందు క్షుణంగా పరిశీలించి రిజిస్ట్రేషన్‌లో నోటు చేసుకోవాలన్నారు. దరఖాస్తుపై ప్రజలకు తగిన అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విద్యాధర్ తదితరులు ఉన్నారు.
నవతెలంగాణ-అక్కన్నపేట
కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రజాపాలన ఐదు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోందని అక్కన్నపేట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య అన్నారు. శుక్రవారం గుబ్బడి, జనగాం, అంతక పేట, చౌటపల్లి గ్రామాలలో ప్రజా పాలన కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వంద రోజుల్లో 6 గ్యారంటీలు పూర్తి చేస్తామన్న హామీ నెల రోజుల్లోనే నెరవేర్చుకోవడం ఆనందదాయకమన్నారు. ప్రజలు ఎలాంటి ఫైరవీలను నమ్మకుండా డైరెక్ట్ గా గ్రామపంచాయతీ వద్ద మీకు ఏ పథకం కావాలో దానికి అర్జీ పెట్టుకోవాలని తెలియజేశారు. నిరుపేదలైన ప్రతి ఒక్కరికి ఈ ఆరు గారెంటీలు వర్తిస్తాయని హామీ ఇచ్చారు. ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాలు వర్తిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు దాము, సింగిల్ విండో వైస్ చెర్మన్ ఎగిడి ఐలయ్య, డైరెక్టర్ బండి కుమార్, గుడాటిపల్లి సర్పంచ్ బద్దం రాజిరెడ్డి, అక్కన్నపేట సర్పంచ్ సంజీవరెడ్డి, సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, మేక రమేష్, వల్లపు పరశురాం, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-తొగుట
ప్రజలందరు ఆరు గ్యారంటీ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలని వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని తుక్కా పూర్ గ్రామంలో సర్పంచ్ చిక్కుడు చంద్రం ఆధ్వ ర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆరు గ్యారంటీ పథకాలు అమలు కోసం దరఖాస్తులు స్వీకరించారు. కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్,తహసీల్దార్ శ్రీకాంత్,ఉప సర్పంచ్ లింగాల శ్రీలత స్వామి,వార్డ్ సభ్యులు బోయిని మురళి, బోయిని బాలరాజ్,చెరుకు రేణు క లక్ష్మ రెడ్డి,అంగన్వాడీ టీచర్స్,ఆశా కార్యకర్తలు, గ్రామ సిబ్బంది,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ- రాయపోల్
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనతోనే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడానికి అభయ హస్తం ఆరు గ్యారంటీలు అమలు చేయడానికి శ్రీకారం చుట్టిందని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం రాయపోల్ మండలంలోని మంతుర్ గ్రామంలో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆరు గ్యారెంటీలు అమలుకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిసెంబర్ 28 నుంచే ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రజా పాలనను కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకాన్ని చేసినట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హులైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ రూ.10 లక్షల వైద్య సాయం గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సష్టించిందన్నారు. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను అమలు చేయడానికి ప్రజా పాలన కార్యక్రమానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం, దేశం అభివద్ధి చెందుతుందన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. కాంగ్రెస్ పథకాలు ఇంటింటికీ అందేవిధంగా కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో తహసిల్దార్ దివ్య, మంతూర్ సర్పంచ్ వెంకటరామిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు దయాకర్ రెడ్డి, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పట్నం యాదగిరి, యూత్ విభాగం అధ్యక్షులు దయాకర్, నాయకులు లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మిరుదొడ్డి
అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేవిధంగా ప్రతి ఒక్కరూ కషి చేయడం జరుగుతుందని తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో రాజిరెడ్డిలు తెలిపారు. శుక్రవారం మిరుదొడ్డి మండలంలోని కాసులాబాద్, అల్వాల, మల్లుపల్లి గ్రామాల్లో ఆరు గ్యారంటీలపై గ్రామసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను ప్రజలకు అందే విధంగా దరఖాస్తులు అందించిన వారికి వెంటనే రశీదు అందించడం జరుగుతుందని తెలిపారు. గ్రామంలోని పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తును అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గజ్జల సాయిలు, జెడ్పీటీసీ లక్ష్మీ లింగం, వైస్ ఎంపీపీ పోలీస్ రాజులు, సర్పంచ్‌లు కిష్టయ్య, తుమ్మల బాలరాజు, లక్ష్మీ యాదగిరి, సిద్ది భారతి భూపతి గౌడ్, ఆర్‌ఐ కొండల్ రెడ్డి, రాజకుమార్ సూపరింటెండెంట్ నారాయణ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ-హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ పట్టణంలో నిర్వహిస్తున్న ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని హుస్నాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత కోరారు. శుక్రవారం పట్టణంలోని 3, 4, 16, 17వ వార్డులలో ప్రజా పాలన కార్యక్రమం నిర్వహించారు. ఆరు గ్యారంటీల దరఖాస్తులు స్వీకరణ కేంద్రాలను మున్సిపల్ కమిషనర్ ఎం రాజశేఖర్, చైర్మన్ రజిత పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఐలేని అనిత శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్లు కోమటి స్వర్ణలత, జనగామ రత్నమాల, వల్లపు రాజు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మీర్జాపూర్‌లో ప్రజా పాలన
హుస్నాబాద్ మండలంలోని మీర్జాపూర్, తిమ్మాపూర్, ఉమ్మపుర్ , బల్లి నాయక్ తండా గ్రామంలో శుక్రవారం ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎంపీపీ లకావత్ మానస, తహసీల్దార్ రవీందర్ రెడ్డి ప్రారంభించారు. గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తరాల లతా మహేందర్, ఎంపీఓ సత్యనారాయణ, సీడీపీఓ జయమ్మ, ఏఈఓ కాశ బోయిన విజరు, పంచాయతీ కార్యదర్శి శారద వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-కొమురవెల్లి
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారంటీ పథకాలకు ప్రజల నుంచి దరఖాస్తులను అధికారులు తీసుకున్నారు. శుక్రవారం మండలంలోని గౌరయపల్లి, మర్రి ముచ్చాలా గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తలారి కీర్తన, సర్పంచులు సద్ది కష్ణారెడ్డి, బోడిగం పద్మ, తహసీల్దార్ లక్ష్మీనారాయణ, ఆర్‌ఐ శ్రీనివాస్, పిఎసిఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, గ్రామ పంచాయితీ సెక్రటరీలు రవీందర్, కరుణాకర్, పలు శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ-తొగుట
ఆరు గ్యారంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని వెంకట్రావు పేట, పెద్ద మసాన్ పల్లి గ్రామాలలో ఆరు గ్యారంటీ పథకాల అమలుకు ప్రజల నుంచి దరఖాస్తులు స్వీక రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం అమలు చేసేందుకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుందన్నారు. ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని గురువారం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంబించిందని తెలిపారు. ప్రజా పాలనను కోరుకుని, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ప్రజలందరికీ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్టుగానే, ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తం ఆరు గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేశారన్నారు. ప్రభుత్వం కొలువుదీరిన 48 గంటల్లోనే తెలంగాణ ఆడ బిడ్డలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, అర్హు లైన వారందరికీ రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వైద్య సాయంతో గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సష్టించిందన్నారు. ప్రతి గ్రామంలో ఉన్న పేదవారికి సైతం సంక్షేమ పథకాలు అందినప్పుడే రాష్ట్రం, దేశం అభివద్ధి చెందుతుందని, ప్రజాపాలన ఉద్దేశం నిస్సహాయులకు సాయం చేయటమేనన్నారు. మహా లక్ష్మి, రైతు భరోసా, గహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గాంధారి లత నరేందర్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు కంకణాల నర్సింలు, సర్పంచ్ మెట్టు వర లక్ష్మి స్వామి ఎంపీటిసి మష్టి సుమలత కనకయ్య, ఉప సర్పచ్ రాజీ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు అక్కం స్వామి, టీపీసీసీ ఫిషర్మెన్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రేపాక తిరుపతి ముదిరాజ్, యెన్నం భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, అనిల్, సంతోష్, రాములు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.