కలేడలో ప్రజా ఆశీర్వాద యాత్ర

నవతెలంగణ – మాక్లూర్
మండలంలోని కల్లేడ గ్రామంలో మంగళవారం ప్రజా ఆశీర్వాద యాత్రను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు అనేక అభివృద్ది కార్యక్రమలు చేశామని, మరో సారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేసుకుందామని అన్నారు. గ్రామంలోని కుల సంఘాల వద్దకు వెళ్లి ప్రజలను ఎమ్మెల్యే కలిశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మాస్తా ప్రభాకర్, వైస్ ఎంపిపి సిక్కి సుజాత, సొసైటీ వైస్ చైర్మన్ రమేష్, సర్పంచులు పుప్పాల లక్ష్మి గంగారెడ్డి, అనుగు గంగాధర్, ఉప సర్పంచ్ మనీష్ గౌడ్, నాయకులు గండ్డం సాగర్, చిన్న రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love