నవతెలంగాణ-రామారెడ్డి :జూన్ 5వ తేదీ లోపు వరి కొనుగోలు పూర్తి చేసి, ధాన్యం తరలిస్తామని డిసిఓ రామ్మోహన్ అన్నారు. ఆదివారం మండలంలోని అన్నారం వరి కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. డైరెక్టర్ స్వామి గౌడ్ మాట్లాడుతూ… వరి కొనుగోలులో లారీల కొరత ఉన్నందున, వెంటనే స్పందించి లారీలలో ధాన్యాన్ని తరలించాలని కోరగా, డి సి ఓ రామ్ మోహన్ మాట్లాడుతూ మాచారెడ్డి పి ఎస్ సి ఎస్ పరిధిలోని అన్నారం టి పి సి సెంటర్లో ఇప్పటివరకు 6418 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించామని, కొనుగోలు సెంటర్లో 150 మంది రైతులకు చెందిన దాదాపు 5000 క్వింటాళ్ల ధాన్యం ఉందని, 1800 సంచుల తూకం వేసిన ధాన్యం బస్తాలు నిల్వ ఉన్నాయని, పూర్తి చేయడానికి దాదాపు 17 లారీలు రవాణా కోసం అవసరమని సంబంధిత అధికారులకు త్వరితగతిన పూర్తి చేయడానికి సూచనలు చేశామని తెలిపారు. రాబోయే వర్షాల దృశ్య తూకం వేసిన వరి బస్తాలను, వరి కుప్పలను టార్పాలిన్లతో కప్పి భద్రపరచడానికి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ స్వామి గౌడ్, అధికారులు చంద్రారెడ్డి, క్లస్టర్ అధికారులు, రైతులు గడ్డం చిన్న గంగారెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.
జూన్ 5వ తేదీ లోపు కొనుగోలు పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



