షాట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం

– రూ. 2లక్షల ఆస్తి నష్టం.
– కట్టుబట్టలతో రోడ్డున పడ్డ వృద్ధురాలు
నవతెలంగాణ – మల్హర్ రావు
షాట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు ఎడ్ల లక్ష్మీ నర్సమ్మకు చెందిన పూరిల్లు దగ్దమై రూ.2 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిన సంఘటన మండలంలోని నాచారం గ్రామపంచాయతీ పరిధిలోగల మల్లయ్య పల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.గ్రామస్తులు, బాధితురాలు పూర్తి కథనం ప్రకారం లక్ష్మీ నర్సమ్మ ఇంటి ప్రక్కన త్రిపేస్ కరెంట్ లైన్ ప్రమాదకరం ఉంది.కరెంట్ తిగలకు తాకేలా చెట్లు ఉన్నాయి.ఇందుకు తోడుగా ఆదివారం సాయంత్రం గాలి దుమారం రావడంతో చెట్ల కొమ్మలు తిగలకు తగిలి షాట్ సర్క్యూట్ యి నిప్పులు పూరిల్లుపై పడి మంటలు చెలరేగి పురిల్లు బుగ్గిపాలైయింది.ఈ అగ్ని ప్రమాదంలో రూ.28 వెలు నగదు, తులంనర బంగారు ఆభరణాలు, రెండు క్వింటాళ్ల బియ్యంతోపాటు నిత్యావసర వస్తులు,సర్వం కాలిపోయి కట్టుబట్టలతో రోడ్డున పడి, దాదాపు రూ.2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు కన్నీరుమున్నీరైయింది.ప్రమాదం విషయం తెలుకున్న యూత్ కాంగ్రెస్ నాయకులు కన్నూరి అశోక్,దొగ్గేల సంపత్,ఎడ్ల భాస్కర్ తదితరులు గ్రామపంచాయతీ వాటర్ ట్యాoటర్ ద్వారా మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు.కానీ అప్పటికే పూరిల్లు అగ్ని ఆహుతికి పూర్తిగా బుగ్గియింది. ఆర్థికంగా బాధితురాలును ఆదుకోవాలని గ్రామస్తులు ప్రభుత్వానికి, అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Spread the love