విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

– పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచాన రఘునందన్‌
నవతెలంగాణ-కందుకూరు
విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేస్తుందని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్‌ మెంట్‌ డిప్యూటీ తహసీల్దార్‌ మాచాన రఘునందన్‌ అన్నారు. శుక్రవారం గురుకుల పాఠశాలలో డీటీ కనిఖీ చేశారు. విద్యార్థుల ఆహారం విషయంలో రజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అనంతరం ఏ..మ్మా!అన్నం ఎలా ఉంది అని విద్యార్థినులను ఆత్మీయంగా పలకరించి విద్యార్థులకు వడ్డించే ఆహారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆయన కందుకూరులో ఉన్న కేజీబీవీ గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రఘునందన్‌ మాట్లాడుతూ పాఠశాలలు గురుకులాలకు సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యత కలిగిన సన్న బియ్యం అని చెప్పారు. అన్నం వండటంలో కూడా జాగ్రత్తలు పాటించాలన్నారు. విద్యార్ధులతో రఘునందన్‌ ఆత్మీయంగా మాట్లాడారు ‘మీరు తింటున్న అన్నం ఎలా ఉంది’ ఇంట్లో తిన్నట్టే ఉందా, లేక ఏమైనా ఇబ్బంది ఉందా..అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అన్నం వండే పాత్రలకు, తగిన కళాయిపూత ఉంటే..అన్నం మరింత రుచికరంగా ఉంటుందని సూచించారు. పాఠశాల ప్రాంగణంలో గణిత దినోత్సవం సందర్భంగా ముగ్గు వేసిన విద్యార్ధినులను అభినందించారు.

Spread the love