హైదరాబాద్ లో ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు..

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు చేస్తున్నారు. రూల్స్ పాటించని హోటళ్లు, రెస్టారెంట్లపై కొరడా ఝళిపిస్తున్నారు.  ఈ క్రమంలో సోమవారం రోజున  మాదాపూర్ లోని నారాయణ సొసైటీపై ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు.  దోశ ఫ్యాన్ అపరిశుభ్రంగా చిలుము పట్టి ఉండడాన్ని గమనించారు అధికారులు. ఆహార పదార్థాలను గ్రైండింగ్ చేసే ఏరియాలో ఇతర పదార్థాలు కలిసే విధంగా అక్కడ పరిస్థితి ఉంది.  వాష్ ఏరియా అపరిశుభ్రంగా ఉన్నట్లు గుర్తించారు.  ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం.. హోటల్, రెస్టారెంట్ల అందరికీ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రతిఒక్కరూ నాణ్యమైన ఆహారాన్ని అందించాలని,  నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భారీ జరిమానాలు తప్పవని  ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్​ హోటల్స్ యజమానులను హెచ్చరించారు.

Spread the love