పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి

– మహిళలకు భద్రత కల్పించాలి
– ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆశలత
– అక్టోబర్‌ 5న చలో ఢిల్లీ
– భారీగా మహిళలు తరలి రావాలి
నవతెలంగాణ- సిద్దిపేట
పెంచిన ధరలు వెంటనే తగ్గించాలని, సమాజంలో మహిళలకు రక్షణ కల్పించాల ని ఐద్వా రాష్ట్ర ఉపాధ్య క్షులు ఆశలత కేంద్ర ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐద్వా కార్యాలయంలో జిల్లా కమిటీ సింగిరెడ్డి నవీన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ కేంద్రంలో బీజేపీ అధికారం లోకి వచ్చిన తర్వాత మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. అనేక చోట్ల అత్యాచారాలు జరుగు తుంటే, వాటిని అరికట్టకుండా, కేంద్ర మంత్రులు సైతం నీచపు మా టలు మాట్లాడుతూ మహిళ లను కించపరిచే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. భారత మాత ముద్దు బిడ్డలం అని చెప్పుకునే వారు మాతమూర్తులను అగౌరవ పరచడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ఇప్పటికైనా పటిష్టమైన చట్టాలు తెచ్చి, కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు. అలా రక్షణ కల్పించినప్పుడు మాత్రమే స్త్రీలకి మనం ఇచ్చే గౌరవం అని వారన్నారు. అక్టోబర్‌ 5న చలో ఢిల్లీకి భారీగా మహిళలు తరలి రావాలనీ కోరారు. ఈ సమావేశంలో ఐద్వా జిల్లా గైడ్‌ దాసరి కళావతి, జిల్లా కార్యదర్శి అత్తిని శారద, జిల్లా కమిటీ సభ్యులు కాముని మంజు లత, రాణి, శోభ, శిరీష, నరసమ్మ, సమీరా పాల్గొన్నారు.

Spread the love