రాజ బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి ఘనంగా జయంతి వేడుకలు

నవతెలంగాణ -నిజామాబాద్ సిటీ 

తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజ బహుదూర్ వెంకట్ రామ్ రెడ్డి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్కం మనోజ్ రెడ్డి మాట్లాడుతూ… రాజ బహదూర్ వెంకట్రాంరెడ్డి సేవను కొనియాడారు. నిజాం పాలనలో సిటీ పోలీస్ కమిషనర్ గా నీతి నిజాయితీకి కట్టుబడి పదవి బాధ్యతలు నిర్వహించారని అన్నారు. అలాగే రెడ్డి పేద విద్యార్థులకు రెడ్డి హాస్టల్ కట్టించి వసతిని కల్పించాలని, బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేసి బాలికల విద్యను ప్రోత్సహించడం జరిగిందని అన్నారు. ఆయన మొదటగా ఇన్ స్పెక్టర్ గా జాయిన్ అయి, నిజం ప్రభుత్వంలో నిజాం రాజుకు ప్రత్యేక పోలీస్ అధికారిక నిర్వహించడం జరిగింది. అలాగే మహబూబు నగర్, నిజాంబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ ,సైబరాబాద్ జిల్లాలో పనిచేయడం జరిగిందని అన్నారు. రెడ్డి విద్యార్థులు మరియు ఇతర విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఎంతో పాటుపడినరని అన్నారు. రెడ్డి పేదా విద్యార్థుల కోసం విద్య, ఉద్యోగ రంగాలలో కృషి చేస్తామని రాజ బహుదూర్ వెంకట్ రామ్ రెడ్డి ఆశాలను నెరవేర్చడానికి తోడ్పాటు పడతామని లక్కం మనోజ్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రెడ్డి సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి మేక బాగా రెడ్డి, ఉపాధ్యక్షులు యూత్ అధ్యక్షులు గంగారెడ్డి, ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, నాగిరెడ్డి, కృష్ణారెడ్డి, జిల్లా నాయకులు మేక కిష్టారెడ్డి, బురుగుపల్లి సురేష్ రెడ్డి, ఈగ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love