గవర్నమెంట్ కాలేజీ టాఫర్ గా పీఎంహెచ్ విద్యార్ధిని రాజేశ్వరి

– ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణత 42 % 
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని ఖమ్మం పాడు కు చెందిన పి.రాజేశ్వరి పిఎం హెచ్ (గిరిజన బాలికల వసతి గృహంలో ) ఉంటూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండో సంవత్సరం హెచ్.ఈ.సీ విద్యార్ధిని కళాశాల టాఫర్ గా నిలిచింది. ఈ విద్యార్ధిని 1000 మార్కులకు గానూ 904 మార్కులు సాధించి తన సత్తా చాటింది. ఈ కళాశాల ప్రిన్సిపాల్ ఎ.సాగర్ తెలిపిన వివరాలు ప్రకారం 23 – 24 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం 80 మంది,ద్వితీయ సంవత్సరం 60 మంది మొత్తం 140 మంది విద్యార్ధులు పరీక్షలు రాయగా ప్రధమ సంవత్సరంలో 12 మంది,రెండో సంవత్సరంలో 25 మంది మొత్తం 37 మంది మాత్రమే ఉత్తీర్ణత పొందారు.మొదటి సంవత్సరం 15 శాతం,రెండో సంవత్సరం 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. మొదటి సంవత్సరం లో హెచ్ ఈ సీ విద్యార్ధిని రామ చరణ్య 399/500 మార్కులు సాధించింది.ఎం పీ సీ విద్యార్ధి ఐ.జశ్వంత్ 391/470 మార్కులు సాధించాడు. హెచ్ ఈ సీ కి చెందిన విద్యార్ధిని ఎస్.నందిని 361/500 మార్కులు సాధించాడు. రెండో సంవత్సరంలో హెచ్ ఈ సీ విద్యార్ధిని జి.రాజేశ్వరి 904/1000 మార్కులు సాధించి కాలేజీ టాఫర్ గా నిలిచింది. బై పీ సీ కి చెందిన విద్యార్ధిని కే.లక్ష్మి 851/1000 మార్కులు సాధించింది.ఇదే గ్రూపు చదువుతున్న పి.రమ్య అనే విద్యార్ధిని 843/1000 మార్కులు సంపాదించి ఇటు కళాశాల బోధనా సిబ్బంది,అటు తల్లిదండ్రులు మన్ననలు పొందుతున్నారు.
Spread the love