
మండల కేంద్రంలోని ఐకెపి ఆధ్వర్యంలో కొనసాగుతున్న మానసిక వికలాంగుల పాఠశాలలో రాఖీ పండుగ జరుపుకోవడం జరిగిందని వికలాంగుల సిసి శ్రీరామ్ తెలిపారు. దివ్యాంగుల పునరవాస కేంద్రంలో వికలాంగులకు, బుద్ధి మాంద్యం విద్యార్థులకు, మానసిక వికలాంగులకు రాఖీలు కట్టి స్వీట్ తినిపించి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పునరావాస కేంద్రం సిసి మరియు క్లస్టర్ సిసి రాములు మరియు సి ఆర్ పి దివ్యాంగులు పాల్గొన్నారు.