ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ డైరెక్టర్‌గా రమణకుమార్‌ బాధ్యతల స్వీకరణ

ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ డైరెక్టర్‌గా రమణకుమార్‌ బాధ్యతల స్వీకరణనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి సిహెచ్‌ రమణకుమార్‌ సోమవారం ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ డైరెక్టర్‌గా బాధ్యతలను స్వీకరించారు. ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ డైరెక్టర్‌గా ఉన్న ఎస్‌ శ్రీనివాసాచారిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మోడల్‌ స్కూల్‌ అదనపు సంచాలకులుగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. శ్రీనివాసాచారిని రమణకుమార్‌ శాలువా కప్పి సన్మానించారు. ప్రభుత్వ ముద్రణాలయ సంస్థ నూతన డైరెక్టర్‌ రమణ కుమార్‌ను నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌజ్‌ జనరల్‌ మేనేజర్‌ రఘు, సేల్‌ బుక్‌ ప్రింటర్స్‌ ప్రతినిధి బాల్‌రెడ్డి కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ డైరెక్టర్‌ శ్రీనివాసాచారికి వీడ్కోలు పలికారు.

Spread the love