రామోజీ రావు మనందరికీ మార్గనిర్దేశకులు: ఎడిటర్స్ గిల్డ్

నవతెలంగాణ – హైదరాబాద్ : మీడియా మొఘల్ రామోజీరావు మృతి పట్ల ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘రామోజీ మరణం విచారకరం. ఎన్నో విషయాల్లో ఆయన మనందరికీ మార్గనిర్దేశకులు. నిజాన్ని నిర్భయంగా మాట్లాడే వ్యక్తి. మీడియా రంగానికి ఆయన చేసిన కృషి జర్నలిస్టులందరిలో నిరంతరం స్ఫూర్తి కలిగిస్తుంది’ అని ప్రకటనలో తెలిపింది. కాగా రామోజీ 1987లో ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాకు ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు.

Spread the love