జుక్కల్ కాంగ్రేస్ గెలుపునకు కారణాలు..

నవతెలంగాణ-జుక్కల్ :  జుక్కల్ నియేాజక వర్గంలో 2023 నవంబర్ 30వ తేదిన జర్గిన ఎన్నికలలో కాంగ్రేస్ పార్టీ అబ్యర్థి తోట లక్ష్మికాంతారావ్ గెలుపు ఉహించినదే. గతంలో ముఖ్యంగా కాంగ్రేస్ గిలిచే అవకాశం ఉన్న మాజీ ఎమ్మెలే ప్రవర్తన , మాటశైలీ ప్రజలకు తిరస్కరించారు. ప్రస్తుతం కాంగ్రేస్ అబ్యర్థి అన్యుహంగా తక్కువ మేజార్టీతో  గెలుపొందాడు. ప్రజలు మార్పు కోరుకున్నారు. మెుదటి సారీగా నియేాజక వర్గానికి చెందని వ్యక్తి బయటినుండి వచ్చి ఆరునెలలోనే జుక్కల్ నియేాజకవర్గానికి వచ్చి ప్రచారంచేసి  ఎమ్మెలే గా గెలిచిన తీరు ప్రజాసామ్యం బతికే ఉందని విధంగా అద్పుతమైన తీర్పు నిచ్చారు ప్రజలు. కాంగ్రేస్ అబ్యర్థి లక్ష్కీకాంతారావ్ తోట   స్థానికేతరుడు అని పదేపదే ప్రచార అస్త్రంగా వాడిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే,  ఇతరులు ప్రచారస్త్రంగా వాడిన ప్రజలు బిఅర్ఎస్ అబ్యర్థి షిండేను   రిజెక్ట్ చేసారు. కారణాలు మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండే ఓటమి, లక్ష్మీకాంతారావ్ గెలుపుకు కారణాలు ముఖ్యంగా మాజీ ఎమ్మెలే హన్మంత్ షిండేడ ప్రజలతో నేరుగా కలవక పోవడం, మండలానికి ఒక రెండవస్థాయి కార్యకర్తలకు అనదికారాలు ఇచ్చి ప్రజలకు ఎమ్మెలేకు దూరం పెర్గడం జర్గింది. ఇసుక మాఫియాతో సంభందాలు ఉన్నాయని ఇతని ప్రోద్బలంతో  ఇసుక నడుస్తోందని ఆరోపణలు పెద్దఎత్తున ప్రచారం  , ద్వీతీయశ్రేణి అనుచరుల అగడాలకు అడ్డుకట్ట లేక పోవడంతో ప్రభూత్వ పథకాలలో కమీషన్లు తీసుకోవడం, రైతుబంధు పథకం అందరికి ఇవ్వకపోవడం, డబుల్ బెడ్ రూం లు పూర్తీగా నియేాజకవర్గంలో ఎక్కడైన  కట్టించక పోవడం, బిచ్కుంద, పిట్లంలో లో కొంత మందికి కట్టించారని తెల్సింది కానీ నమ్మలేదు జనాలు. మిగతా వారికి రాకపోవడం ప్రజలలో వ్యతిరేకత వచ్చింది. చిట్ట చివరగా  ఒకప్పుడు కాంగ్రెసే మాజీ ఎమ్మెలే గంగారాం తో చీకటి ఒప్పందం ఉందనే వారు కొంతమంది మాటలు నేడు నిజమైంది, కానీ ప్రజలు నమ్మలేదు , ప్రస్తుతం కాంగ్రేస్ పార్టీ గంగారాం కు టికెట్  నిరాకరించడంతో   వీరి బండారాం బహిరంగంగా బయట పడటంతో  హన్మంత్ షిండే , గంగారాం ఒక్కటే నని ప్రజలకు తెలవడంతో విరిద్దిరికి బుద్ది చెప్పాలనే  ఉద్దేశంతో ఇద్దరిని ఓడించి కాంగ్రేస్ కు పట్టం కట్టారు.

Spread the love