దౌర్జన్యం చేసిన వ్యక్తిపై అట్రాసిటీ నమోదు

– ఫిర్యాదు చేసిన బాధితులు
నవతెలంగాణ-ములకలపల్లి
ఆధార్‌ కార్డు ద్వారా డబ్బులు డ్రాచేసేందుకు వెళితే మా డబ్బులు మాకు ఇవ్వకుండానే కమీషన్‌ రూ.20 తీసుకుని దౌర్జన్యం చేయడానికి వచ్చిన వ్యక్తిపై బాధితుడు పాయం లలిత (భర్త వెంకటేష్‌) మంగళవారం స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేశారు. పొగళ్లపల్లి పంచాయతీ ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన పాయం లలిత భర్త వెంకటేష్‌ కలిసి ములకలపల్లిలోని సత్యగాయత్రి మెడికల్‌ షాపు వద్దకు వెళ్లి ఆధార్‌ ఆధారంగా డబ్బులు డ్రా చేయాలని కోరామని, దీనికి రూ.1000కి కమీషన్‌ రూ.20 తీసుకుంటానని చెప్పగా రూ.10 తీసుకోవాలని అండగడంతో కుదరని నిర్వాహకుడు చెప్పగా మాకు ఇష్టంలేదని తిరిగి వెళుతున్న సమయంలో కమీషన్‌ డబ్బులు ఇవ్వకుండా ఎలా వెళతారంటూ దౌర్జన్యానికి షాపు నిర్వాహకుడు దిగాడని భర్త ఆ కమీషన్‌ డబ్బులు చెల్లించగా భార్య పాయం లలిత ఏ సేవలు పొందకుండా డబ్బులు ఎందుకు కట్టావు అని అడిగిందని తెలిపారు. ఆ సమయంలో షాపు నిర్వాహకుడు సుబ్రమణ్యంతో పాటు ముగ్గురు వ్యక్తులు గొడవ చేయడంతో పాటు ఫోన్‌ లాక్కునే ప్రయత్నం చేశారని, అమాయక గిరిజనులం కావడంతో ఆసభ్యంగా ప్రవర్తించినందుకు అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మంగళవారం స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు బాధితులు తెలిపారు. అధిక కమీషర్లు వసూలు చేస్తున్న షావు నిర్వాహకునిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Spread the love