దక్షిణ ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలు

నవతెలంగాణ-భిక్కనూర్
మండలంలోని బిటిఎస్ వద్ద ఉన్నా తెలంగాణ విశ్వవిద్యాలయ దక్షిణ ప్రాంగణంలో కాంట్రాక్ట్ అధ్యాపకులు మంగళవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ గుప్తా మాట్లాడుతూ 106 రోజుల నుండి సమస్యలు పరిష్కారం కొరకు ఆందోళన చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తామని తెలిపారు. నేడు సౌత్ క్యాంపస్ లో ముఖ్యమంత్రి నివేదన సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని, 12 విశ్వవిద్యాలలో పనిచేస్తున్న కాంటాక్ట్ అధ్యాపకులు పాల్గొనడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించాలని, లేనిచో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు యాలాద్రి, సునీత, నరసయ్య, రమాదేవి, నిరంజన్, సరిత, వైశాలి, శ్రీమాతా, తదితరులు పాల్గొన్నారు

Spread the love