స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యంతో ఏర్పాటు చేయబోయే ఈ వర్సిటీ కోసం ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించిన విషయం విదితమే. ఈ క్రమంలో రాష్ట్ర గవర్నర్‌ సంబంధిత గెజిట్‌ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నారు.

Spread the love