నాలుగో విడుత ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల..

Election Commissionనవతెలంగాణ-హైదరాబాద్ : నాలుగో విడుత సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్‌ వెలువడింది. పది రాష్ట్రాల్లోని 96 లోక్‌సభ స్థానాలతోపాటు తెలంగాణలోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌, ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్‌ జరుగుతుంది. జూన్‌ 4న ఫలితాలు వెల్లడిస్తారు. నాలుగో విడతలో లోక్‌సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్‌, జార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, జమ్ముకశ్మీర్‌ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్‌సభ స్థానాల్లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి.

Spread the love