పంట పొలాలకు నీటి విడుదల


నవతెలంగాణ-రామగిరి: ఎండల తీవ్రత పెరిగి వరి పొలాలు ఎండిపోయే పరిస్థితులు వచ్చే అవకాశం ఉండటంతో మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గుండారం రిజర్వాయర్ వద్ద స్థానిక ప్రజాప్రతినిధులుగేట్లు ఎత్తిడి 83 కెనాల్ ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఆయకట్టు పరిధిలోని చివరి గుంట వరకు పంట పొలాలన్నింటిని కాపాడాలని శ్రీధర్ బాబు సంబంధిత ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వ డంతో గేట్లు తెరిచి నీళ్లు ఇవ్వడం జరిగిందని వారు పేర్కొన్నారు.
సాగు నీరు అందక పొలాలు ఎండిపోతాయని రైతు లెవరూ అదైర్యపడవద్దని.. సాగు నీటి విషయంలో శ్రీధర్ బాబు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చిస్తున్నారని., అవసర మైనప్పుడల్లా నీటి విడుదల కొనసాగు తుందన్నారు. ఈ కార్యక్రమంలో రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొముర య్యగౌడ్, మంథని మున్సిపల్ చైర్మన్ పెండ్రు రమ, వైస్ చైర్మన్ శ్రీపతి బానయ్య, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముసుకుల సురేందర్ రెడ్డి, మంథని నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ఇన్ చార్జి బర్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణరెడ్డి, మాజీ సర్పంచ్ బుద్ధార్తి బుచ్చన్న, రామగిరి మండల సోషల్ మీడియా ఇన్చార్జి సిద్ధం మురళీకృష్ణ, కల్వచర్ల ఉపసర్పంచ్ కనకయ్య, మంథని మున్సిపల్ కౌన్సి లర్ వీకే రవి, చెవుల వినోద్, రైతులు, నాయకులు పాల్గొన్నారు.

Spread the love