డ్రైనేజీల మీద అక్రమ కట్టడాల తొలగింపు

Adilabadనవతెలంగాణ-మందమర్రి
డ్రైనేజీల మీద అక్రమ కట్టడాలను శుక్రవారం మున్సిపల్‌ సిబ్బంది తొలగించారు. మార్కెట్‌ వేణుగోపాల్‌ డిష్‌ లైన్‌లోని రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీల మీద అక్రమంగా నిర్మించిన కట్టడాలను మున్సిపల్‌ సిబ్బంది పోలీస్‌ బందోబస్త్‌ నడుమ తొలగించారు. డ్రైనేజీలపై అక్రమ కట్టడాల వల్ల వర్షం పడినప్పుడు దిగువ ప్రాంతాలైన భగత్‌సింగ్‌ నగర్‌, శ్రీపతినగర్‌ ఇండ్లలోకి మురుగునీరు రావడంతో బస్తీ వాసులు అనారోగ్యాలకు గురవతున్నట్లు కాలనీ వాసులు తెలిపారు. ఇదే సమస్యపై ఇరు కాలనీలకు చెందిన రాయబారపు కిరణ్‌, రవి కిరణ్‌, వెంకన్న, శేఖర్‌, సోమయ్య, గౌతం మున్సిపల్‌ కమిషనర్‌ను పిలిపించి సంబంధిత అధికారులకు 15 రోజులుగా తమ గోడుని చెప్పుకున్నారు. డ్రైనేజీల మీద కట్టడాలను కూల్చివేయడం భగత్‌సింగ్‌ నగర్‌, కమాన్‌ తర్వాత కల్వర్టు కిందికి ఉన్నట్లు తెలిపారు. కల్వర్ట్‌ని ఎత్తుగా నిర్మించాలని తద్వారా నీరు సులువుగా వెళ్లడం జరుగుతుందని కమిషనర్‌కి తెలిపారు. సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడం పట్ల కమిషనర్‌ వెంకటేశ్వర్లను స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.

Spread the love