మోడీ తాళి కట్టిన మహిళ దిక్కుతోచని స్థితిలో ఉంది: రేణుకా చౌదరి

నవతెలంగాణ – ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ భార్యపై కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గాంధీ భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మాంగళ్యం విలువ మోడీకి తెలియదని విమర్శించారు. మంగళసూత్రం గురించి ప్రస్తావించి మహిళల్ని మోడీ అవమానించారని మండిపడ్డారు. మోడీ తాళికట్టిన వ్యక్తి ఇప్పుడు దిక్కుమొక్కు లేకుండా ఉన్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇలాంటి వ్యక్తి ప్రధానిగా ఉన్నందుకు నవ్వాలో ఏడ్వాలో తెలియడం లేదని ఎద్దేవా చేశారు.

Spread the love