- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్‌లోని 15 పోలింగ్ బూత్‌లలో శనివారం రీపోలింగ్ జరపాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో అక్రమాలు జరిగినట్లు నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. మగ్రహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11, డైమండ్ హార్బర్‌లోని నాలుగు బూత్‌లలో రీపోలింగ్ జరగనుంది. మరోవైపు, ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులనే నియమించాలన్న ఈసీ ఆదేశాలను తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
- Advertisement -



