సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యేకు వినతి

నవతెలంగాణ – నాగోల్‌
కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరిం చాలంటూ నాగోలు డివిజన్‌లోని అయ్యప్ప కాలనీవాసులు ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌ రెడ్డికి మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి ని అయ్యప్ప కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అయ్యప్ప కాలనీలో నూతనంగా నిర్మించిన బాక్స్‌ డ్రైనేజీ నిర్మాణంతో కాలనీలో ఉన్న పైపులైన్లు పగిలి పోవడం జరిగి ందని కాలనీవాసులు ఎమ్మెల్యే దష్టికి తెచ్చారు. ఈ సందర్భగా కాలనీవాసులు మాట్లాడుతూ ఇరవై ఏండ్ల కిందట అప్పటి జనాభాకనుగుణంగా 6 ఇంచుల పైప్‌ లైన్లు వేశా రని గుర్తుచేశారు. కాలనీలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా వలన డ్రైనేజీ ప్రవాహంతో పైపులు కూడా పగిలిపోయాయని, దీంతో మాన్యువల్స్‌లలో కూడా మట్టి చేరి డ్రైనేజీ మురుగు నీరంతా రోడ్లపై ప్రవహిస్తుందని తెలిపారు. దాదాపు 600 కాలనీలలో నుండి వచ్చే డ్రైనేజీ, వర్షపు నీరు ఇక్కడకు వచ్చి చేరడంతో అవుట్‌ ఫ్లో లేని కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీంతో అనారోగ్యాల బారిన పడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కాలనీపై దష్టి సారించి వెంటనే తగిన నిధులను మంజూరు చేయించి నూతన పైపులైన్లు, మ్యాన్‌ హౌల్స్‌లను, రోడ్ల నిర్మాణ పనులను చేపట్టి సమస్యలను పరిష్కరించాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే సుధీర్‌ రెడ్డి మాట్లాడుతూ అయ్యప్ప కాలనీ సమస్యలపై ఇప్పటికే ఎన్నోసార్లు సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ దష్ట్యా అధికారులంతా ఎన్నికల హడావుడిలో ఉన్నారని, ఎన్నికల అనంతరం తప్పకుండా అయ్యప్ప కాలనీ సమస్యల పరిష్కారానికి కషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప కాలనీవాసులు నరసింహాచారి, రవికాంత్‌ శర్మ, సుదర్శన్‌, గోపాల్‌, కాలనీ మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love