నవతెలంగాణ -తాడ్వాయి
మండలంలోని తాడ్వాయి గ్రామ పంచాయితీ పరిధిలోని జలగలంచ గుత్తి కోయ గూడానికి కరెంట్, మిషన్ భగీరథ నీళ్లు అందివ్వాలని జలగలంచ గూడెం వాసులు జడ్పీ చైర్మన్ కు గురువారం వినతిపత్రం చేశారు. ఈ సందర్భంగా ములుగు చైర్మన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ ఉన్నత అధికారులతో మాట్లాడి, వచ్చేవిదంగా కృషి చేస్తానని జిల్లా చైర్మన్ బడే నాగజ్యోతి బరోసానిచ్చారు. జలగలాంఛ గుత్తి కోయ గ్రామంలో 36 కుటుంబాల ఆదివాసి ప్రజలు నివాసం ఉంటున్నారని, నేటికి వారికి కరెంట్, మంచినీటి వసతులు లేకపోవడంతో అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నిసార్లు చెప్పినా వారి మొర ఎవరు ఆలకించలేదని, జలగలంచ వృత్తి కోయ ఆదివాసి గిరిజనలు జడ్పీ చైర్మన్ కు ఫోన్ చేసి మొరపెట్టుకున్నారని అన్నారు. తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టె ప్రతి సంక్షేమ పథకాలను అందించే విదంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. జిల్లా చైర్మన్ బడే నాగజ్యోతి కి జలగలంచ గ్రామస్థులు కృతజ్ఞతలు తెలిపారు.