అంగన్వాడీలపై నిర్బంధం కేసీఆర్‌ నియంతృత్వానికి పరాకాష్ట

– రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో అఖిలపక్ష నాయకులు
– అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు
నవతెలంగాణ-పాల్వంచ
నిత్యం ప్రజల్లో వుంటూ గర్భిణీలకుకు, బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ ఆరోగ్యవంతమైన తెలంగాణను నిర్మిస్తున్న అంగన్వాడీల న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తూ పరిష్కారం చేయకుండా సమ్మెపై నిర్బంధం ప్రయోగించడం కెసిఆర్‌ పరాకాష్ట అని వామపక్ష నాయకులు, టీపీసీసీ జనరల్‌ సెక్రెటరీ ఎడవల్లి కృష్ణ, సీపీఐ మండల కార్యదర్శి వీసంశెట్టి పూర్ణచందర్‌ రావు, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కల్యాణం లక్ష్మీపతి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి కామేష్‌, ప్రజపంథా సబ్‌ డివిజన్‌ కార్యదర్శి టీజేఎస్‌ నాయకులు బరగడి దేవదానం, ఆమ్‌ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్‌ చరప పాపారావు, వృత్తి దారుల జిల్లా కార్యదర్శి ముసలయ్యలు అన్నారు. అంగన్వాడీ టీచర్ల సమ్మె 9వ రోజుకు చేరింది. ఈ సందర్బంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు దొడ్డా రవికుమార్‌ అధ్యక్షతన అఖిలపక్ష రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఏర్పాటు చేశారు. పలువురు మాట్లాడుతూ స్వరాష్ట్రం ఏర్పడ్డాక బారాస ప్రభుత్వంలో శ్రమ దోపిడీ ఇంకా ఎక్కువ అయిందని, ప్రభుత్వ శాకలన్నింటిలోనూ నిత్యం రాష్ట్రంలో ప్రతి చోట ఉద్యోగులు, శ్రామికులు వారి కనీస హాక్కులకై పోరాటం చేయాల్సి వస్తుందని అన్నారు. ప్రభుత్వం ఇకనైనా వీరి సమస్యలను తీర్చకపోతే అవుసరమైతే అఖిలపక్షం మొత్తం అంగన్వాడీలకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటానికి కూడా సిద్ధమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్‌ జిల్లా అధ్యక్షులు ఎస్‌.కె రహీం, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షులు నుకల రంగారావు, టీడీపీ నాయకులు పూర్ణచందర్‌ రావు, ఏఐటీయూసీ నాయకులు బండి నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) నాయకులు ఎస్‌.కె నిరంజన్‌, తులసిరామ్‌, ఐద్వా నాయకురాలు కాంతి అంగన్వాడీ నాయకులు వెంకటరమణ, రమ్య, రాజ్యలక్ష్మి, అచ్చమ్మ, మంజు, విజయ, తదితరులు పాల్గొన్నారు.
టీపీసీసీ జనరల్‌ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ ఈ సమ్మెకు సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించి, మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ తరపున తమ మద్దతు ఉంటుందని, రేపు అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్‌ పార్టీ అని అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసేది కాంగ్రెస్‌ పార్టీ అని అందరూ గుర్తుంచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షులు నూకల రంగారావు, మండల అధ్యక్షుడు కొండం వెంకన్న గౌడ్‌, బత్తుల వెంకటేశ్వరరావు తదతరులు పాల్గొన్నారు.
భద్రాచలం రూరల్‌: అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ వినాయక విగ్రహానికి మంగళవారం మెమోరండం అందజేశారు. భద్రాచలంలో సమ్మెను సీఐటీయూ కన్వీనర్‌ ఎం.బి.నర్సారెడ్డి ప్రారంబించి మాట్లాడారు. ఐసీడీఎస్‌లో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్లకు మినీ టీచర్లకు హెల్పర్లకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ చట్టాన్ని అమలు చేయాలని, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ టీచర్కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5 లక్షలు ప్రకటించాలన్నారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని అయిన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు ఎన్‌.నాగరాజు, జి.లక్ష్మీకాంత్‌, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు నాయకులు ఝాన్సీ, అనురాధ, అధ్యక్ష, కార్యదర్శులు లలిత, విజయలక్ష్మి, మినీ అంగనవాడీ టీచర్స్‌, నాయకులు మీడియం సావిత్రి, జ్యోతి, రాజేశ్వరితో పాటు మండలంలోని అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్లు తదితరులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: అంగన్వాడీలు గత 9 రోజులుగా చేస్తున్న న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దిగివచ్చి పరిష్కరించకపోతే ఈ సమ్మెను ఉధృతం చేస్తామని సిఐటియు జిల్లా కార్యదర్శి డి.వీరన్న ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా దశల వారి పోరాటాలకు పిలుపునిస్తూ దీక్షా శిబిరం వద్ద రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సభలో సిఐటియు జిల్లా కార్యదర్శి వీరన్న పాల్గొని మాట్లాడారు. బుధవారం కొత్తగూడెం ఎమ్మెల్యే ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా 22, 23 తేదీలలో అన్ని జిల్లా కేంద్రాల్లో సామూహిక దీక్షలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సంఘం నాయకులు పద్మ, కళావతి, మాధవి, శైలజ, జుబేదా, నర్సం భాగ్య, సరోజ, రమ తదితరులు పాల్గొన్నారు.
ఆళ్ళపల్లి/గుండాల : అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించకపోతే ప్రభుత్వ పతనం తప్పదని సీఐటీయూ ఆశా వర్కర్ల యూనియన్‌, మధ్యాహ్న భోజన పథకం సంఘాల నాయకులు, ఎస్‌టీ హాస్టల్‌ డైలీ వేజ్‌ ఔట్‌ సోర్సింగ్‌ వర్కర్స్‌ యూనియన్ల నేతలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ మేరకు ఆళ్ళపల్లి, గుండాల మండల కేంద్రాల్లో అంగన్వాడీల సమ్మె శిబిరంలో వినాయక చవితి పండుగ రోజు కూడ పస్తులు ఉండాలా.. అని మూతికి గుడ్డ కట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం పాయం సారమ్మ అధ్యక్షతన జరగగా సభలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి అబ్దుల్‌ నబి, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మలు హాజరై, మాట్లాడారు. ఈ అంగన్వాడీల సమ్మెకు ఆళ్ళపల్లి, గుండాల మండలాల ఆశ వర్కర్లు, మధ్యాహ్న భోజన సంఘం నాయకులు నజ్మా, నర్సమ్మ, ముత్యాలు, పొంబోయిన లక్ష్మీ, హాస్టల్‌ డైలీ వేజ్‌ నాయకులు కొట్టెం బాలయ్య పూర్తి మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో జవ్వాజి పద్మ, పూనెం సుజాత, జయశ్రీ, మమత, దనమ్మ, పూలమ్మ, వెంకటమ్మ, కౌసల్య, నీలిమ, మంజుల తదితరులు పాల్గొన్నారు.
సమ్మెకు ప్రజాపంథా సంపూర్ణ మద్దతు
గుండాల మండల కేంద్రంలో అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు మంగళవారం సీపీఐ (ఎంఎల్‌) ప్రజాపంథా పార్టీ సంపూర్ణ మద్దతును తెలియజేసింది. ఈ సందర్భంగా పాయం సారమ్మ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు గుమ్మడి నర్సయ్య, హైకోర్టు న్యాయవాది గోవర్ధన్‌, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ హెల్పర్లు గత తొమ్మిది రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పూనుకోవాలని, లేనియెడల సమ్మెను ఉదతపరచడానికి మద్దతుగా నిలబడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ అధికారి శర్మ, ప్రజాపంథా జిల్లా నాయకులు ఈసం శంకర్‌, బుర్ర వెంకన్న, బోస్‌, వాంకుడోత్‌ అజరు, మండల కార్యదర్శి కొమరం శాంతయ్య తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు: బూర్గంపాడు మండల కేంద్రంలో అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల జాయంట్‌ యాక్షన్‌ కమిటీ అధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారంకు 9 రోజులకు చేరుకుంది. సుప్రీం కోర్ట్‌ తీర్పు ప్రకారం అంగన్వాడీలకు కనీస వేతనం అమలు చేయాలని, చట్టపరమైన హక్కులు కల్పించాలని తదితర సమస్యలు నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా యూనియన్‌ జిల్లా అధ్యక్షురాలు జిలకర పద్మ, జిల్లా కాంగ్రెస్‌ పీసీసీ సభ్యులు డాక్టర్‌ చందా సంతోష్‌, తాళ్ళూరి చక్రవర్తి, బట్టా విజరు గాంధీ వాసుదేవరావు, నాగమణి, సుజాత, పులపెల్లి సుధాకర రెడ్డి, నాగరాజు, సాంబ సమ్మెకు మద్దతు తెలియజేశారు. సీపీఐ(ఎం) మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు రాయల వెంకటేశ్వర్లు, రామనాథం, నాగేశ్వరావు, సీఐటీయూ మండల కన్వీనర్‌ బర్ల తిరుపతిరావులు, అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా అంగన్వాడీల యునియన్‌ నాయకులు డిమాండ్స్‌తో కూడిన వినతి పత్రాన్ని బత్తుల, విజరు గాంధీలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో 150 మంది అంగన్వాడి టీచర్లు ,హెల్పర్లూ పాల్గొన్నారు.
అశ్వారావుపేట: అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం వెంటనే జీవో ఇవ్వాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్‌ చేసారు. మినీ అంగన్వాడీ కేంద్రాలకు హెల్పర్‌లను నియమిస్తూ నోటిఫికేషన్‌ ఇచ్చేలా ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా నిరసనలు చేపట్టాలని ఆయన మంగళవారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిరంజీవి, సిఐటియు నాయకులు పిట్టల అర్జున్‌, కాంగ్రెస్‌ నాయకులు ఆదినారాయణ, జూపల్లి రమేష్‌, సర్పంచ్‌ అట్టం రమ్య, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు నాయకులుతో పాటు మండలంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ టీచర్లు హెల్పర్లు సంపూర్ణంగా సమ్మెలో పాల్గొన్నారు.
దుమ్ముగూడెం: అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26,000 చెల్లించాలని, గ్రాడ్యుటి అమలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌, పెన్షన్‌ పెంపు మరియు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్షులు పులి సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 9వ రోజు దీక్ష శిబిరాన్ని ఆయన సందర్శించి అంగన్వాడీలకు సంఘీభావం తెలిపి, మాట్లాడారు. తమ సమస్యలను పరిష్కరించాలని అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు గత తొమ్మిది రోజులుగా సమ్మె చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపో వడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ నాయకురాలు కమలాదేవి, గజలక్ష్మి, కృష్ణవేణి, సృజన, రమణ, చిన్నారి తదితరులు పాల్గొన్నారు.
అంగన్వాడీ సమ్మెకు మద్దతు ప్రకటించిన అఖిల పక్ష పార్టీలు
ఇల్లందు : తహశీల్దార్‌ కార్యాలయం వద్ద గత 9 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్ల సాధనకు కోసం నిరవధిక సమ్మె చేస్తున్న క్రమంలో అఖిల పక్ష పార్టీలు మంగళవారం సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు. అనంతరం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అంగన్వాడి టీచర్స్‌ కే.మరియ, నాగలక్ష్మిల అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటియూసి దేవరకొండ శంకర్‌, సీపీఐ(ఎం) అబ్దుల్‌ నబి, సీపీఐ బంధం నాగయ్య, సీపీఐ ఎంఎల్‌ న్యూ డెమోక్రసీ ఆవునూరి మధు, న్యూ డెమోక్రసీ జే.సీతా రామయ్యా, తుపాకుల నాగేశ్వర రావు, ఐఎఫ్టియు రాసుద్ధిన్‌, జిల్లా కార్యదర్శి సారంగపాణి, యాకన్న, రమేష్‌, కాంగ్రెస్‌ డా.రవి, పులి సైదులు, గుడివాడ వీరభద్రం, కమల, బీఎన్‌ గోపాల్‌, టీడీపీ ముద్రగడ వంశీ, సీహెచ్‌ రమేష్‌, సీఐటీయూ కూకట్ల శంకర్‌, తదితరులు రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్య క్రమంలో ఈసం వెంకటమ్మ, మమత, ఫాతిమా, రాంబాయి, అరుణ దేవేంద్ర కారం పద్మ సుజాత పాల్గొన్నారు.
అంగన్వాడీ సిబ్బంది సమ్మెకు ఏవీఎస్పీ మద్దతు
చర్ల : 9 రోజులుగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, మినీ టీచర్లు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మెకు ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్‌ మంగళవారం సంపూర్ణ మద్దతు తెలియజేసింది. ఆ సంఘం రాష్ట్ర నాయకులు పాండ్రు హేమ చందర్‌, నూప నాగేశ్వరరావు, శ్రీను తదితరులు చర్ల అంబేద్కర్‌ సెంటర్లో గల అంగన్వాడీ సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతును తెలియజేసి, మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పుని తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయా లని టీచర్‌కు రూ.10 లక్షలు, హెల్పర్‌కు రూ.5లక్షలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పించాలని డిమాండ్‌ చేశారు. సమ్మెకు ఏవీఎస్పీతోపాటు ఇతర ఆదివాసి సంఘాల మద్దతును కూడా కూడగడతామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, తెలంగాణ అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు ప్రాజెక్ట్‌ కమిటీ అధ్యక్షులు పాలెం నాగమణి, ఎం.విజయశీల, ప్రాజెక్టు కమిటీ నాయకులు పాల్గొన్నారు.
సమ్మె చేస్తున్న సంఘాలతోటి ప్రభుత్వం చర్చలు జరపాలి
గత తొమ్మిది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న అంగన్వాడీ టీచర్లు మినీ టీచర్లు హెల్పర్ల సమస్యలపై సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సంఘాలతోటి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని అంగన్వాడీ సమ్మెకు మద్దతుగా చర్ల సిఐటియు కార్యాలయంలో జరిగిన రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. తెలంగాణ అంగన్వాడి టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు చర్ల ప్రాజెక్టు కార్యదర్శి ఎం.విజయశీల అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం నరేష్‌, బహుజన సమాజ్వాది పార్టీ జిల్లా కార్యదర్శి తడికల శివకుమార్‌, సిఐటియు జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి, వ్యకాస మండల కార్యదర్శి బందెల చంటి, తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌ మండల కార్యదర్శి శ్యామల, సమ్మక్క, తెలంగాణ ఆశా వర్కర్స్‌ యూనియన్‌ మండల నాయకురాలు సుజాత, ఐకెపి వివోఏల సంఘం మండల నాయకులు పాయం రవి పాల్గొని మాట్లాడారు. ఈ రౌండ్‌ టేబుల్‌ సమావేశానికి సిఐటియు మండల కన్వీనర్‌ పాయం రాధాకుమారి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు శ్యామల వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లూరి కృష్ణ, నాయకులు సత్రంపల్లి సాంబశివరావు, అంగన్వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు చర్ల ప్రాజెక్టు కమిటీ నాయకురాలు పాలెం నాగమణి, స్వరూప, విజయలక్ష్మి, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

Spread the love