
రిటెడ్ ఇంజనీర్ దొంతుల లక్ష్మీనారాయణకు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హసూపత్రి కి తరలించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మల్లన్నసాగర్ ముంపు గ్రామం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన దొంతుల లక్ష్మీ నారాయణ గత సోమవారం రోజున గుండెపో టు రావడంతో హైదరాబాద్ లోని దుర్గాబాయ్ దేశముఖ్ హసూపత్రిలో చికిత్స నిర్వహించారు. హార్ట్ ఆపరేషన్ చేసి 2 స్టెంట్లు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టును నిర్మాణం చేసే సమయంలో ముంపు గ్రామాల ప్రజలకు, రైతులకు ప్రాజెక్టు గురించి వివరించారు. ఈ ప్రదేశంలో మల్ల న్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనువైన ప్రదేశం కాదని, మల్లన్నసాగర్ నిర్మాణం చేస్తే భవిష్యత్ లో ఇబ్బందులు జరుగుతాయని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయిన తరువాత కోర్టులను సైతం ఆశ్రయించారు. గుండెపోటు కు గురైన లక్ష్మీనారాయణ ను ఆయన మిత్రులు హసూపత్రి పరామర్శించారు.