Sunday, July 19, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికా దాడులకు ప్రతీకారం

అమెరికా దాడులకు ప్రతీకారం

- Advertisement -

విమానాశ్రయ కార్యకలాపాలు నిలిపివేత.. గగనతలం
పూర్తిగా మూసివేత
 బహ్రెయిన్‌, జోర్డాన్‌ల పైనా దాడులు
 అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యం
 యూఎస్‌ దారుణాలకు
అదేస్థాయిలో ప్రతిస్పందిస్తాం : ఐఆర్‌జీసీ ఘాటు హెచ్చరిక

గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ క్షిపణుల వర్షం కువైట్‌లో విద్యుత్‌, సముద్ర జలాల శుద్ధి కేంద్రాలకు నష్టం
అటు దాడులు.. ఇటు పునరుద్ధరణ పనులు
ఇరాన్‌పై కొనసాగుతున్న
అమెరికా వైమానిక దాడులు
టెహ్రాన్–తబ్రిజ్ మార్గంలో
రైల్వే పునఃప్రారంభం

అమెరికా వరుసగా ఏడో రోజూ ఇరాన్‌ సైనిక లక్ష్యాలపై వైమానిక దాడులకు పాల్పడడంతో .. ఇరాన్‌ శనివారం తన ప్రతీకార దాడులను మరింత పెంచింది. అమెరికాకు మద్దతు ఇస్తున్న గల్ఫ్‌ దేశాలైన కువైట్‌, బహ్రెయిన్‌, జోర్డాన్‌లపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు జరిపింది. దాదాపు మూడు నెలల తర్వాత తొలిసారిగా సౌదీ అరేబియాపైనా దాడులు జరిగినట్టు సమాచారం. దీంతో మధ్యప్రాచ్య యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం నెలకొందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
దుబాయ్‌ : అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ (సీఈఎన్‌టీసీఓఎం) వరుసగా ఏడో రోజు ఇరాన్‌పై దాడులు కొనసాగించింది. ఈ దాడుల్లో నిఘా కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్‌ కేంద్రాలు, భూగర్భ ఆయుధ నిల్వలు, సముద్ర యుద్ధ సామర్థ్యాలకు సంబంధించిన స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు అమెరికా ప్రకటించింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్‌ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కార్ప్స్‌ (ఐఆర్‌జీసీ) అమెరికా మిత్రదేశాలపై భారీ దాడులు ప్రారంభించింది.

కువైట్‌పై దాడులు తీవ్రం
కువైట్‌పై ఇరాన్‌ భారీ క్షిపణి దాడులకు పాల్పడడంతో అది అత్యంత తీవ్రంగా దాడులకు గురైంది. సముద్ర జలాలను తాగునీటిగా మార్చే డీసాలినేషన్‌ ప్లాంట్‌ దెబ్బతింది. ఈ దాడుల కారణంగా దేశవ్యాప్తంగా వైమానిక హెచ్చరిక సైరన్లు మోగగా, కువైట్‌ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేసి అన్ని విమాన సర్వీసులను నిలిపివేసింది. కువైట్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. విద్యుత్‌ ఉత్పత్తి, సముద్రజలాల శుద్ధి కేంద్రాలు కూడా దెబ్బతినడంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించి కీలక సేవల కొనసాగింపునకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కువైట్‌ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన ఒక చమురు కేంద్రం కూడా దాడిలో దెబ్బతింది. మంటలను అదుపు చేసేందుకు వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, చమురు రంగ కార్మికుల్లో పలువురు గాయపడ్డారని కువైట్‌ సాయుధ దళాలు తెలిపాయి. ఇరాన్‌ మాత్రం కువైట్‌లోని క్యాంప్‌ అరిఫ్జాన్‌లో ఉన్న అమెరికా సైనిక సహాయక కేంద్రాన్ని, అలి అల్‌ సలేం వైమానిక స్థావరంలోని రాడార్‌ వ్యవస్థను ధ్వంసం చేశామని ప్రకటించింది. పలువురు అమెరికా సైనికులు మరణించినట్టు ఐఆర్‌జీసీ పేర్కొంది. తమ ‘ఆపరేషన్‌ నస్ర్‌-2’లో భాగంగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని దాడులు నిర్వహించినట్టు ప్రకటించింది. సముద్ర మార్గాల్లోనూ దాడులు కొనసాగించినట్టు ఇరాన్‌ ప్రభుత్వ మీడియా పేర్కొంది.

​మూడు నెలల తర్వాత సౌదీపై దాడులు?
ఇరాన్‌ ప్రభుత్వ మీడియా కథనాల ప్రకారం.. బహ్రెయిన్‌లోని షేక్‌ ఈసా ఎయిర్‌బేస్‌ వద్ద అమెరికా యుద్ధ విమానాలు నిలిపి ఉంచిన ప్రాంతాన్ని టెహ్రాన్‌ లక్ష్యంగా చేసుకుంది. అక్కడి ఇంటెలిజెన్స్‌ డేటా కేంద్రంపైనా దాడి చేసినట్టు తెలిపింది. జోర్డాన్‌లోని అల్‌ అజ్రాక్‌ అమెరికా సైనిక స్థావరంపై క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసి కనీసం రెండు అమెరికా యుద్ధ విమానాలు, మరో మూడు విమానాలను ధ్వంసం చేశామని ఇరాన్‌ పేర్కొంది. కాగా దాదాపు మూడు నెలల తర్వాత ఇరాన్‌… సౌదీ అరేబియాపైనా దాడులు జరిపినట్టు తెలుస్తోంది. రాజధాని రియాద్‌ సమీపంలోని అల్‌-ఖర్జ్‌ ప్రాంతంలో హెచ్చరిక సైరన్లు మోగాయి. ఎర్ర సముద్ర తీరంలోని యన్బు ప్రాంతంలో కూడా అలర్ట్‌ ప్రకటించారు. అమెరికా సైనిక బలగాలు ఉన్న ప్రిన్స్‌ సుల్తాన్‌ ఎయిర్‌బేస్‌ లక్ష్యంగా దాడి జరిగిందని సమాచారం. అయితే సౌదీ ప్రభుత్వం ఈ అంశంపై అధికారిక వివరాలు వెల్లడించలేదు. ఇరాన్‌ కూడా తన ప్రకటనలో సౌదీ దాడిని ప్రస్తావించలేదు.

​ మరిన్ని దాడులు చేస్తాం.. ఆ దేశాలు మూల్యం చెల్లించుకోవాలి : ఐఆర్‌జీసీ
అమెరికా ఇరాన్‌లో వంతెనలు, విద్యుత్‌ కేంద్రాలు, ఇతర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకోవడంపై ఐఆర్‌జీసీ తీవ్రంగా స్పందించింది. ‘‘అమెరికా సైన్యం చేస్తున్న దారుణాలను అడ్డుకునే అంతర్జాతీయ సంస్థ ఏదీ లేకపోవడంతో.. ‘ఎవరు మీపై దాడి చేస్తే వారికి అదే విధంగా ప్రతిదాడి చేయండి’ అనే ఖురాన్‌ ఆదేశాన్ని అనుసరించడం తప్ప మాకు మరో మార్గం లేదు’’ అని ఐఆర్‌జీసీ పేర్కొంది. అమెరికాకు మద్దతు ఇస్తున్న ప్రాంతీయ దేశాలు మరిన్ని దాడులకు సిద్ధంగా ఉండాలని ఘాటుగా హెచ్చరించింది. ఆ దేశాలు పౌర రక్షణ చర్యలను వెంటనే అమలు చేసి, ప్రజలను సైనిక లక్ష్యాల నుంచి దూరంగా తరలించాలని సూచించింది. కాగా ఈ హెచ్చరిక అనంతరం తొలి చర్యగా కువైట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్టు ఐఆర్‌జీసీ ప్రకటించింది. కాల్పుల విరమణ ఒప్పందం గత వారం పూర్తిగా విఫలమైన తర్వాత అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. శుక్రవారం అమెరికా హార్ముజ్‌ జలసంధి వద్ద నౌకాదళ దిగ్బంధం అమలు చేస్తున్నట్టు ప్రకటించగా.. ఇరాన్‌ మాత్రం తన నిబంధనలను ఉల్లంఘించిన నౌకలను లక్ష్యంగా చేసుకుంటున్నట్టు తెలిపింది.

తబ్రిజ్ :
అమెరికా ఇరాన్ లోని మౌలిక సదుపాయాలపై ఓ పక్క దాడులకు పాల్పడుతుంటే .. మరోపక్క ఇరాన్‌ వాటి పునరుద్ధరణ పనుల వేగాన్ని పెంచుతోంది. సాధారణంగా ఎక్కడైనా దాడులు, విధ్వంసాలు జరిగితే.. వాటిని పునరుద్ధరించడానికి చాలా సమయం పడుతోంది. కానీ అందుకు భిన్నంగా ట్రెహాన్‌లోని తబ్రిజ్ వద్ద పునరుద్ధరణ పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. అమెరికా వైమానిక దాడితో నిలిచిపోయిన కీలకమైన బందర్ అబ్బాస్ జంక్షన్ వద్ద రైల్వే కార్యకలాపాలు శుక్రవారం అధికారికంగా పునఃప్రారంభమయ్యాయి. బందర్ అబ్బాస్‌కు పశ్చిమాన 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లక్షిత జంక్షన్, ప్రయాణికుల, సరుకు రవాణా మార్గాలను వ్యూహాత్మక షాహిద్ రాజాయీ పోర్ట్‌కు , ప్రధాన బందర్ అబ్బాస్ రైల్వే వ్యవస్థకు నేరుగా కలుపుతుంది.
ఇదిలా ఉండగా, బందర్ అబ్బాస్–సిర్జాన్ హైవేపై ఉన్న రెండు వ్యూహాత్మక షాహిద్ మీర్జయీ బాటిల్‌నెక్ సొరంగాలలో ఒకదానిని అత్యవసర ఇంజనీరింగ్ , రోడ్ సిబ్బంది విజయవంతంగా తిరిగి తెరిచారు. హోర్మోజ్గాన్ రోడ్లు , పట్టణాభివృద్ధి డైరెక్టర్ జనరల్ మజీద్ సలాష్షోర్, మార్గంలో భారీ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సొరంగం ద్వారా వాహనాల రాకపోకలు పునఃప్రారంభమయ్యాయని ధ్రు వీకరించారు. అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకున్న అనేక వంతెనలపై కూడా సలాష్షోర్ తాజా సమాచారాన్ని అందించారు, ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. దాష్త్-ఎ ఇమామ్ ప్రాంతంలోని షోర్ నది వంతెన వద్ద ప్రస్తుతం ఒక బైపాస్ ద్వారా ట్రాఫిక్ మళ్లించారు. అమెరికా వైమానిక దాడి తర్వాత రుడాన్ జంక్షన్ వంతెన వద్ద ఒక బైపాస్‌ను వెంటనే క్రియాశీలం చేశారు, దీంతో ప్రాంతీయ రవాణాకు అంతరాయం లేకుండా కొనసాగుతోంది.

అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్‌ కీలక మౌలిక వసతులు
అమెరికా దాడుల్లో ఇరాన్‌ దక్షిణ ప్రాంతంలోని పలు కీలక మౌలిక వసతులూ దెబ్బతిన్నాయి. హార్ముజ్‌ గాన్‌ ప్రావిన్స్‌లో ముగ్గురు మరణించారు. ఎనిమిది మంది గాయ పడ్డారు. రెండు వంతెనలు, ఒక రహదారి సొరంగం ధ్వంసమయ్యాయి. అంతకుముందు రోజు ఐదు వంతెనలు ధ్వంసమైనట్టు ఇరాన్‌ మీడియా తెలిపింది. బందర్‌ ఖమీర్‌ ప్రాంతంలో ఏడుగురు మర ణించారు. రైల్వే స్టేషన్‌ దెబ్బతింది. ఇరాన్‌ష హర్‌ విమానాశ్రయం కూడా దాడికి గురైనట్టు సమాచారం. జాస్క్‌ నగరంలో విద్యుత్‌ కేంద్రాలు, డీసాలినేషన్‌ పంపులు దెబ్బతిన సుమారు 20 గ్రామాల్లో 10 వేల మంది తాగునీటి సమస్యను ఎదుర్కొన్నారు.

యూఎన్‌ ప్రధాన కార్యదర్శి తీవ్ర ఆందోళన
ఈ పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రెస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పౌర మౌలిక వసతులపై జరుగుతున్న దాడులు పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయని ఆయన ప్రతినిధి తెలిపారు.

ముడి చమురు ధరలకు రెక్కలు..
అమెరికా కాంగ్రెస్‌ ఎన్నికల్లో ప్రభావం ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం ఈ జలసంధి గుండా వెళ్తుండటంతో ప్రపంచ ఇంధన మార్కెట్లలో ఆందోళన నెలకొంది. యుద్ధం
మరింత విస్తరించే సంకేతాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం ఒక్కరోజే 4 శాతానికి పైగా పెరిగి నెలరోజుల గరిష్ఠ స్థాయికి చేరాయి. ఈ పరిణామం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌పై కూడా రాజకీయ ఒత్తిడిని పెంచుతోంది. నవంబర్‌లో జరిగే కాంగ్రెస్‌ ఎన్నికలకు ముందు ఇంధన ధరల పెరుగుదల కీలక అంశంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -