- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల పరిధిలోని మేనూర్ గ్రామంలోని మెయిన్ రోడ్డును గ్రామస్తులు ఆక్రమించుకుని సీసీరోడ్డు కూడా వేయడానికి వీలులేకుండా చేశారని సర్పంచ్ అశోక్ పటేల్, కార్యదర్శి హరీష్ కుమార్ లు అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో మంగళవారం రోడ్డును ఆక్రమించిన వారందరికీ తొలగింపు నోటీసులు జారీ చేసినట్లు కార్యదర్శి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రోడ్డుకిరువైపులా లాక్రమించిన కబ్జాలను ఎవరికి వారు తొలగించి, గ్రామాభివృద్ధికి సహకరించాలని నోటీసులో పేర్కొన్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



